Site icon HashtagU Telugu

Odyssey Electric: ఒక్క ఛార్జ్‌.. 125 కిమీ రేంజ్.. కేవలం 999తో బుకింగ్!

Odyssey Electric Releases Vader Electric Bike with One Charge Range of 125 Km

One Charge.. 125 Km Range.. Booking With Just 999!

Odyssey Electric Releases Vader Electric Bike : ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ కీలక తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ (Odyssey Electric) తన రెండో ఎలక్ట్రిక్ బైకుని  అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి రేంజ్ అందించేలా రూపుదిద్దుకుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ధర & బుకింగ్స్..

కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ (Odyssey Vader Electric) బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్ – షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం మార్చి 31 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారం భించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జులైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

డిజైన్..

ఈ బైక్ ఆకర్శించే డిజైన్ లో ఉంది. ఇది డ్యూయెల్​ టోన్​ ఫినిష్, ఎల్​ఈడీ హెడ్​లైట్​, టెయిల్​లైట్​, హాలోజెన్​ ఇండికేటర్స్​, స్ప్లిట్​ సీట్స్​, స్పోర్టీ డెకల్స్​, అలాయ్​ వీల్స్, చిన్న ఫ్లై స్క్రీన్​ వంటి వాటిని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ బైక్ 14 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.

ఫీచర్స్..

  1. 7 ఇంచెస్ ​ఆండ్రాయిడ్​ టీఎఫ్​టీ టచ్​స్క్రీన్​.
  2. దీని ద్వారా బ్లూటుత్​ కనెక్టివిటీ ఆప్షన్ పొందటమే కాకుండా..  బైక్ లొకేటింగ్, జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ అలర్ట్‌, యాంటీ-థెఫ్ట్​ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.
  3. IP67 రేటెడ్ 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్.
  4. ఇది 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
  5. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 125 కిమీ రేంజ్ అందిస్తుంది.
  6. రేంజ్ అనేది రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది.
  7. బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

Also Read:  Alto 800 Maruti Suzuki: “ఆల్టో 800” అల్ విదా.. ఉత్పత్తి ఆపేసిన మారుతీ సుజుకీ