Site icon HashtagU Telugu

Oben Rorr EZ: కళ్ళు చెదిరే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్.. ఇది కదా బైక్ అంటే!

Oben Rorr Ez

Oben Rorr Ez

ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇంధనంతో నడిచే వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఇంధన ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతుండడంతో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే.

ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో మరో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి విడుదల అయింది. మరి ఈ బైక్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ బైక్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 175 కి.మీ నుంచి 95 కి.మీల గరిష్ట వేగాన్ని అందజేస్తుందట. బైక్ టాప్ మోడల్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌లో 175 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందట. అలాగే దాని దిగువ వేరియంట్ల పరిధి దీని కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చని, ఈ బైక్‌ ను మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదని, ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా కాలం పాటు ఉంటుందని,బైక్ గరిష్ట వేగం గంటకు 95 కిలో మీటర్లు, దీనిని 3.3 సెకన్లలో 0-40 kmph నుండి నడపవచ్చని చెబుతున్నారు.

అంతే కాకుండా మీరు ఈ బైక్‌ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా పొందవచ్చట. దీన్ని 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ రోర్ EZ బైక్‌ లో 3 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. దీని కారణంగా రైడ్ నాణ్యత మెరుగుపడుతుందట. రైడింగ్ అనుభవం మెరుగుపడుతుంది. ఈ బైక్‌లో 4 కలర్స్ లో లభిస్తున్నాయట. వీటిలో ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియాన్, లూమినా గ్రీన్ , ఫోటాన్ వైట్ కలర్స్ ఉన్నాయి. ఈ బైక్ ARX ఫ్రేమ్‌వర్క్‌ పై రూపొందించబడింది. ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 89,999 గా ఉంది. అయితే దీని 3.4 kWh వేరియంట్ ధర రూ. 99,999 దాని 4.4 kWh వేరియంట్ ధర రూ. 1,09,999 గా ఉంది.