Electric Roads in India: ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదండోయ్ ఎలక్ట్రిక్ రోడ్లు కూడా.. ప్రయాణిస్తూనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు?

ఇండియా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. ప

Published By: HashtagU Telugu Desk
Electric Roads In India

Electric Roads In India

ఇండియా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఉంటే రహ దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఉపాధిని సృష్టించడానికి వినూత్న పరిష్కారాలు కావాలని తెలిపారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ రోడ్, ఎలక్ట్రిక్ హైవే ల గురించి తాజాగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..

దేశంలో ఇలాంటి రోడ్లు నిర్మించేందుకు కొన్ని సంస్థలతో చర్చలు కూడా జరిపాము. ఇంధనం, ఎలక్ట్రిక్ హైవేలు, మైనింగ్ బంజరు భూములను స్థిరంగా వినియోగించుకోవడంలో స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని మంత్రి కోరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే CII కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా లాభసాటిగా ఉండే ఎలక్ట్రిక్‌ హైవే అభివృద్ధికి పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. సుస్థిర అభివృద్ధే అంతిమ లక్ష్యమని, ఇందుకు రవాణా రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్య రహిత, స్వదేశీ సాంకేతికత అవసరమని అన్నారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను అవలంబించడం ద్వారా, తయారీ ఖర్చులు, దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చని గడ్కరీ తెలిపారు.

రాగి, అల్యూమినియం వంటి లోహాలను రీసైక్లింగ్ చేయడం వలన ఆటో కాంపోనెంట్ తయారీ ఖర్చులు 20 నుంచి 25 శాతం తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా లాభదాయకమైన ఎలక్ట్రిక్ హైవేను రూపొందించడంపై టాటాతో పాటు మరికొన్ని కంపెనీలతో నిన్న మాత్రమే చర్చించాము. మన నగరాలు అభివృద్ధి చెందుతున్న తీరుతో చివరికి మన పట్టణ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. బెంగళూరు లాంటి నగరంలో ప్రజలు ఆఫీసుకు చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు. ముందుగా రోడ్డు శివార్లలో కొన్ని కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా సిద్ధం చేశారు. ఇప్పుడు స్వీడన్ దాదాపు 3000 కిలోమీటర్ల పొడవునా అలాంటి హైవేని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ రోడ్లు ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే..

సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించగలిగేలా రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితో పాటు, ఆర్థికంగా, పర్యావరణ అనుకూలత కూడా తప్పనిసరి పరిస్థితి. ఇందుకోసం చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్‌లను అందించాయి. కొన్ని నమూనాలు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు రైలు లేదా మెట్రోని చూడవచ్చు. అదే సమయంలో, టైర్ల ద్వారా వాహనాల ఇంజిన్‌కు విద్యుత్ ప్రసారం చేయాలనే ప్లాన్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు మనం ప్రయాణిస్తూనే ఆ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జి చేసుకోవచ్చన్నమాట.

  Last Updated: 11 May 2023, 05:37 PM IST