కార్ల వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కార్లలో ఫార్చ్యూనర్ కారు కూడా ఒకటి. ఈ కారుకు మార్కెట్ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈ కారును ఎక్కువగా రాజకీయ నాయకులు అమితంగా ఇష్టపడుతుంటారు. మార్కెట్‌లో అత్యాదునిక ఫీచర్లతో ఎన్ని కార్లు వచ్చినా ఈ కారు సేల్స్ మాత్రం ఫార్చ్యూనర్ క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఫార్చ్యూనర్ కారుకు పోటీగా నిస్సాన్ మోటార్ ఇండియా ఎక్స్ ట్రైల్ పేరుతో జూలై 17న సరికొత్త కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇది ఎక్స్ ట్రయిల్ ఫోర్ట్ జనరేషన్ సీబీయూతో వస్తుందని కంపెనీ వెల్లడించింది.
సీబీయూతో మాగ్నైట్ తర్వాత నిస్సాన్ కార్లలో ఎక్స్ ట్రైల్ రెండో కారుగా నిలిచింది. ఈ కారు భారత మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్లకు పోటీగా నిలుస్తుందని నిస్సాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇకపోతే ఈ కారుకు సంబందించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ నిస్సాన్ ఎక్స్ ట్రైల్ కార్ ఇండియన్ మార్కెట్ లో మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. సాలిడ్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. నిస్సాన్ ఎక్స్ ట్రైల్‌లో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.
ఇది గరిష్టంగా 162 బీహెచ్‌పీ శక్తిని, 300 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్ పుట్ ను విడుదల చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. అలాగే 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే.. ఎక్స్ ట్రైల్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ చేయడానికి పుష్ బటన్ తో కూడిన కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి వాటితో ఉంటుంది. ఆటోమేటిక్ వైపర్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్ బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పరిమిత స్లిప్ డిఫరెన్షియల్ ఫీచర్లు మరింత ఆకర్షిస్తాయి. ఎక్స్ ట్రైల్ పొడవు 4,680 ఎంఎం, వెడల్పు 1,840 ఎంఎం, ఎత్తు 1,725 ఎంఎంగా ఉంది. అలాగే వీలే బేస్ 2,705 మి.మీగా ఉండగా ఈ కారు 7-సీటర్ ఎస్‌యూవీగా ఉంది. ఈ కారు ధర రూ. 40 లక్షలుగా ఉండనుంది.