Site icon HashtagU Telugu

Hero Xtreme 160R: అదరగోడుతున్న హీరో ఎక్స్ ట్రీమ్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 29 Jul 2024 04 15 Pm 2836

Mixcollage 29 Jul 2024 04 15 Pm 2836

భారత మార్కెట్లో హీరో కంపెనీ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ముఖ్యంగా హీరో కంపెనీకు సంబంధించి ఎక్స్‌ట్రీమ్ బైక్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ ను హీరో కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. రూ. 1,38,500 ధరతో డిజైన్, మెకానిక్స్, ఫీచర్లతో సహా ఇతర అప్‌డేట్స్‌ వినియోగదారులను ఆకట్టుకుంటాయట. ఇకపోతే హీరో ఎక్స్‌ట్రీమ్ 16 ఆర్‌ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

హీరో ఎక్స్ట్రీమ్ 160 ఆర్ 4వీ నయా వెర్షన్ బ్లాక్ కలర్, బ్రాంజ్ గ్రాఫిక్స్ కలయికతో కొత్త పెయింట్ స్కీమ్‌ తో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే సింగిల్ పీస్ సీట్ సిట్ సీట్ డిజైన్‌ లో బాగా ఆకట్టుకుంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌కు సపోర్ట్ చేసే ఈ బైక్ డ్రాగ్ రేస్ టైమర్‌ తో బైకర్స్‌ ను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానిక్ బ్రేకింగ్ అలర్ట్ ఫీచర్‌ తో పాటుగా దీని వలన టెయిల్ ల్యాంప్ ఈ బైక్‌ కు సరికొత్త లుక్‌ ను తీసుకువచ్చింది. కానీ హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ బైక్ పవర్ ట్రెయిన్‌ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని హీరో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

అలాగే ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్/ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 16.6 బీహెచ్‌పీ శక్తిని, 14.6 ఎన్ఎం గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. అలాగే సస్పెన్షన్ అప్డ్ డౌన్ ఫోర్క్స్, ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన మోనోషాక్ ద్వారా వస్తాయి. ఈ నేపథ్యంలో నయా వెర్షన్ హీరో బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, హెూండా ఎస్‌పీ 160, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, యమహా ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ 4 బైక్స్‌కు పొడిని ఇవ్వడానికి సిద్ధమవుతోందట.