Site icon HashtagU Telugu

New TVS Ronin: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా టీవీఎస్ ​​బైక్?

New TVS Ronin

New TVS Ronin

New TVS Ronin: టీవీఎస్ అప్డేట్ చేసిన రోనిన్ (New TVS Ronin) బైక్‌ను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 సందర్భంగా పరిచయం చేసింది. ఈసారి బైక్ స్టైల్ భిన్నంగా ఉండడంతో పాటు స్టైల్ కూడా గతంలో కంటే మెరుగ్గా ఉంది. త్వరలోనే దీన్ని లాంచ్ చేస్తారని తెలుస్తోంది. అయితే నివేదిక‌ల ప్రకారం.. బైక్ ధరను ఈ నెలలో అధికారికంగా ప్రకటించవచ్చు. బైక్ సాధ్యమైన ధర, దానిలో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు

మార్కెట్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 2025 రోనిన్ డిజైన్ మార్పులు చేయబడ్డాయి. ఇంతకుముందు దీనిని క్రూయిజర్ బైక్‌గా పరిచయం చేయగా.. ఇప్పుడుఈ మార్పులతో రోనిన్ సిటీ స్ట్రీట్ బైక్‌గా అందించబడుతుంది. ఇది ఈ బైక్ రైడింగ్‌ను మరింత సరదాగా చేస్తుంది. బైక్ వెనుక భాగంలో చాలా మార్పులు కనిపిస్తాయి. కొత్త రోనిన్ సీటు ఇప్పుడు చిన్నదిగా చేయబడింది. వెనుక మడ్‌గార్డ్ మునుపటి కంటే సన్నగా, చిన్నదిగా కనిపిస్తుంది. కంపెనీ ప్రకారం దాని ఇంజిన్ ప్రాంతానికి మునుపటి కంటే క్లీనర్ డిజైన్ ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. ఇదే సమయంలో ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంది. ఇది బైక్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Also Read: PM Modi To Kumbh: నేడు మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌ధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఇంజిన్, పవర్

కొత్త TVS రోనిన్‌లో కేవలం 225cc ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇంజన్ OBD2 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజన్ 20.1bhp శక్తిని, 19.93Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. TVS కొత్త రోనిన్ బైక్ మార్చి నాటికి విడుదల చేయనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీని ధర పెద్దగా పెరగదని ఆశిస్తున్నారు. దీనితో పాటు ఇందులో అనేక వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కొన్ని కొత్త రంగు బైక్‌ల‌ను కూడా చూడవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీ పడనుంది

TVS రోనిన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి ప్రత్యక్ష పోటీదారుగా పరిగణించబడుతుంది. హంటర్ 350 శక్తివంతమైన బైక్. ఇది 349cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ కలిగి ఉంది. అంతేకాకుండా 20.2hp శక్తిని, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ARAI ప్రకారం.. ఈ బైక్ 36.22 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఎంట్రీ-లెవల్ మిడిల్ వెయిట్ బైక్ J-సిరీస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది.