Toyota: టయోటా ఇన్నోవా లేటెస్ట్ మోడల్ చూశారా.. ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే!

వాహన వినియోగదారులు అలాగే ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ని ఈ నెలల

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 07:30 PM IST

వాహన వినియోగదారులు అలాగే ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ని ఈ నెలల అనగా నవంబర్ 25, 2022 న భారత్ లోకి ప్రవేశ పెట్టనున్నారు. కానీ ఇంతకంటే ముందుగా ఈ 3 వరుసల మల్టీపర్పస్ వెహికల్ 21 నవంబర్ 2022 న ఇండోనేషియా మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. కొత్త టయోటా ఎమ్‌పివి కారు నవంబర్‌ లో ఇండియాలో ప్రవేశపెట్టనున్నారు. కానీ ఈ కార్ ధర జనవరిలో జరిగే 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రకటించనున్నారు.

కాగా టయోటా ఇన్నోవా ఇప్పటికే ఇండోనేషియా 3 వరుసల ఎం‌పి‌వి టీజర్‌ ను కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎం‌పి‌వి సరికొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌, బానెట్‌పై స్ట్రాంగ్ క్రీజ్ కనిపిస్తుంది. అలాగే ఈ కారు వెనుక వైపు ఉన్న ఎల్‌ఈ‌డి బ్రేక్ లైట్లు, కొత్తగా స్టైల్ చేసిన 10 స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో హారిజంటల్ టెయిల్ ల్యాంప్‌లు, కొత్త మోడల్ 2,850ఎం‌ఎం వీల్‌బేస్‌, పొడవు 4.7 మీటర్లు ఉంటుంది. 2023 టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టాలో లేని సెగ్మెంట్ లీడింగ్ ఫీచర్‌లతో అమర్చబడి వస్తుంది. ఇకపోతే ఈ కారు ఫీచర్ ల విషయానికొస్తే..

కొత్త ఎంపీవీ లో 360-డిగ్రీ కెమెరాలు, ఫ్యాక్టరీకి ఫిట్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే రెండవ వరుస కెప్టెన్ సీట్ల కోసం ఒట్టోమన్ ఫంక్షన్,వైర్‌లెస్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పాదచారులను గుర్తించే ప్రీ-కొలిజన్ సిస్టమ్, రోడ్ సైన్ అసిస్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు లభించనున్నాయి.