Site icon HashtagU Telugu

Electric Scooter: వృద్ధులు వికలాంగులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్?

Electric Scooter

Electric Scooter

ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎలక్ట్రిక్ బైక్స్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రోజురోజుకీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతుండడంతో ఆయా కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో సరికొత్త ఫీచర్స్ కలిగిన వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ద్విచక్రవాహనాలుగానే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ తొలిసారి మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రత్యేకించి వృద్ధుల కోసం రూపొందించిన ఈ స్కూటర్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ వికలాంగులకు కూడా బాగుంటుందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు పీఈవీ ఫాంటమ్. మరి ఈ స్కూటర్ కి సంబంధించి మరిన్ని వివరాలు లోకి వెళితే.. కేలా సన్స్ మూడు చక్రాల పీఈవీ ఫాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించిన వీడియోను మిస్టర్ ఆటో వారి యూట్యూబ్ ఛానెల్‌ లో పోస్ట్ చేశారు. ఇకపోతే ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ప్రస్తుతం రూ. 88,000 లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు.

ఈ స్కూటర్ డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ తో వస్తుందట. ఈ త్రీ వీలర్ స్కూటర్ రెండు ప్రొజెక్టర్ లైట్ పాడ్‌లను, వృత్తాకార హెడ్‌లైట్ హౌసింగ్‌ లో పగటిపూట రన్నింగ్ ఎల్ఈడీ లను పొందుతుందట. హాలోజన్ ఆధారిత సిగ్నల్ లైట్స్ ఉంటాయి. ఇది 190ఎంఎం డిస్క్ బ్రేక్‌ తో ముందు భాగంలో 10 అంగుళాల సిల్వర్ అల్లాయ్ వీల్‌ ను పొందుతుంది. హ్యాండిల్‌బార్‌ కు రెండు వైపులా మంచి నాణ్యత గల స్విచ్‌ లతో అమర్చారు. కుడి వైపు స్విచ్ లు హెడ్‌లైట్లు, డ్రైవింగ్ మోడ్‌ లను నియంత్రిస్తాయి. ఇక స్కూటర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ ను ఉంటుంది.

వెనుక భాగంలో స్ప్రింగ్‌ లను పొందుతుంది. స్కూటర్ వెనుక భాగంలో పెద్ద పరిమాణంలో సీటు ఉంటుంది. ఇది సర్దుబాటు చేయగల హ్యాండ్ రెస్ట్‌ లను కూడా పొందుతుందట. ఇక ఈ స్కూటర్ కి సంబంధించి స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ పీఈవీ ఫాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 60వోల్ట్స్ 32ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీతో వస్తుంది. అదనపు ఖర్చుతో లిథియం అయాన్ బ్యాటరీకి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 50 నుంచి 60 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇది రెండు వెనుక చక్రాలకు శక్తినిచ్చే 1000 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.