Site icon HashtagU Telugu

Mahindra XUV700: మహీంద్రా నుంచి XUV700 లగ్జరీ కారు.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 24 Jan 2024 02 23 Pm 7939

Mixcollage 24 Jan 2024 02 23 Pm 7939

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల వాహనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మరో సరికొత్త లగ్జరీ కారుని మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా. తాజాగా XUV700 SUVని విడుదల చేసింది. కొత్త కారు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షలుగా ఉంది. కాగా ఇది ప్రారంభ ధర. కొత్త కారు MX, AX3, AX5, AX7, AX7 లగ్జరీ వేరియంట్‌ లలో వస్తుంది, MX వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు కాగా, AX3 వేరియంట్ ధర రూ. 16.39 లక్షలు, AX5 వేరియంట్ రూ.17.69 లక్షలు, AX7 వేరియంట్ రూ. 21.29 లక్షలు, AX7 లగ్జరీ వేరియంట్ రూ. దీని ధర 23.99 లక్షలుగా ఉంది.

కాగా 2021లో తొలిసారిగా భారత్‌లో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్ మోడల్ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల యూనిట్ల విక్రయాల రికార్డును సాధించింది. ఇప్పుడు మరిన్ని కొత్త మార్పులతో మార్కెట్లోకి ప్రవేశించింది. సాంకేతిక అంశాలలో కొన్ని మెరుగైన ఫీచర్లు కాకుండా, కొత్త కారు మునుపటి మోడల్‌కు సమానంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన క్యాబిన్, ఎయిర్ వెంట్స్, సెంట్రల్ కన్సోల్‌లో డార్క్ క్రోమ్ ఫినిషింగ్, నాపోలి బ్లాక్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది. కొత్త XUV700 యొక్క AX7, AX7 లగ్జరీ వేరియంట్‌లకు ఈసారి అధిక స్థాయి ఫీచర్లు అందించబడ్డాయి. కొత్త కారు రెండవ వరుస సీటుకు కెప్టెన్ సీటు, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్‌తో సహా ఆల్ బ్లాక్ థీమ్ కూడా ఇవ్వబడింది.

దీనితో పాటు, కొత్త కారులో మునుపటి మోడల్‌లోని పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆన్షన్లను అందించారు. XUV700 అదే 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఎంపికలతో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 198-bhp, 300-Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే డీజిల్ మోడల్ 183-bhp, 450-Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు కొత్త కారులో వివిధ 83 ఫీచర్లను కలిగి ఉన్న కార్ కనెక్టివిటీ అందించింది. ఇప్పుడు సీట్ మెమరీలో వింగ్ మిర్రర్ కంట్రోల్ యూనిట్ జోడించింది కంపెనీ. అలాగే, కొత్త కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ లాకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్, డ్రైవర్ డ్రెడ్‌నెస్ అలర్ట్, లేన్ కీప్ అసిస్ట్ జోడించింది మహీంద్రా.