Toyota Land Cruiser Mini : టయోటా నుంచి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైయిన్ లో త్వరలోనే సరికొత్త లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ వెహికల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వాహనం టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ (Toyota Land Cruiser Mini) అనే పేరుతో లాంచ్ వచ్చే సంవత్సరం ఆవిష్కరణ చేస్తున్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్ని, మహీంద్రా థార్ వంటి వాహనాలకు పోటీగా ఈ వాహనాన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
టయోటా కంపెనీ నుంచి అత్యంత ప్రజాధరణ పొందిన కార్లలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్ కూడా ఒకటి. ఈ ల్యాండ క్రూయిజర్ కారును సినీ, రాజకీయ నేతలు సహా చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే అభివృద్ధి దశలో ఈ ల్యాండ క్రూయిజర్ కారును ఆఫ్ రోడ్ SUV కారుగా వాడుతున్నారు. ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ కారు (Toyota Land Cruiser Mini) కన్సెప్ట్ వెర్షన్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ఐతే ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ రానుందని సమాచారం. ఈ వాహనాన్ని లైట్ క్రూయిజర్ అని లేదా యూరిస్ క్రూయిజర్ అని కూడా పిలుస్తారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ కారు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ అయినా… ప్రొడక్షన్ లో మాత్రం పెట్రోల్ లేదా డీసెల్ ఇంజిన్ తో అనుసందించి హైబ్రిడ్ మోడల్ గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. అలానే ఈ కారు యొక్క ఎక్సటీరియర్ లో, ప్లేట్ రూఫ్ ను కలిగి ఉండటంతో పాటుగా మినీ కరోలా క్రాస్ సైజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇంకా టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, వృత్తాకార LED హెడ్ ల్యాంప్ లు ఉంటాయని సమాచారం. ఈ కారును అక్టోబర్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ కాన్సెప్ట్ మోడల్‌లో ముందు భాగంలో రెట్రో డిజైన్, మధ్యలో టయోటా బ్రాండ్ తో కూడిన గ్రిల్, దీంతోపాటుగా సిల్వర్ స్కిడ్ ప్లేట్ సహా ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో కూడిన ముందు బంపర్ కూడా ఉంటుందని సమాచారం.
కొన్ని నివేదికల ప్రకారంగా, ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ కాన్సెప్ట్ మోడల్ లో.. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, RAV4 2.5 లీటర్ పెట్రోల్/ హైబ్రిడ్ ఇంజిన్, 2.8 లీటర్ టర్బోచార్జ్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటాయని సమాచారం.
భారత్ లో అందుబాటులో ఉన్న లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ SUV మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి కార్ల విక్రయాలను పరిగణలోకి తీసుకొని టయోటా ఈ కారును భారత్ లోనూ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారు భారత్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుందా లేదా అనేది తెలియలేదు. అయితే దీనిపై టయోటా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్ లో ఈ కారు లాంచ్ పై సంస్థ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.
మారుతి సుజుకి నుంచి లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ జిమ్మీని ప్రారంభించినప్పుడు భారీగా ఆదరణ దక్కింది. ఇటువంటి కార్లను భారత్ లో చాలా మంది ఇష్టపడతారు. టయోటా నుంచి మినీ ల్యాండ్ క్రూయిజర్ కారు భారత్ లో లాంచ్ అయితే ఇదే తరహా ఆదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: Chandrababu : చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ని సస్సెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం