Site icon HashtagU Telugu

Tata Harrier EV: స్టన్నింగ్ లుక్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా నయా ఈవీ కార్?

Mixcollage 07 Feb 2024 01 08 Pm 363

Mixcollage 07 Feb 2024 01 08 Pm 363

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా ఎక్కువగా నడుస్తోంది. వినియోగదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఎక్కువగా చూపిస్తుండడంతో కంపెనీలు కూడా అందుకు అనుగుణంగానే ఈవీ వెర్షన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందన ధరలు మండిపోతుండడంతో పాటు పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు భారతదేశంలో ఈవీ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ఈవీ వాహనాలకు ప్రభుత్వం నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. ఇకపోతే 2023 ఆటో ఎక్స్‌పోలో టాటా రెండు ఈవీ కాన్సెప్ట్‌లను అందించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా టాటా హారియర్ ఎస్‌యూవీకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ ను కళ్ళు జిగేలు మనే రంగులో విడుదల చేసింది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ ఈ కారుకు సంబంధించిన ఫీచర్లను పేర్కొంది. మరి టాటా హారియర్‌ ఈవీ కార్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా టాటాకు సంబంధించిన కొత్త సీవీడ్ గ్రీన్ పెయింట్ షేడ్‌ రిలీజ్‌ చేసిన హారియర్ ఈవీ ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌ కి దగ్గరగా కనిపిస్తోంది. ఈ ఈవీ కారు సరికొత్త యాక్టివ్‌ ఈవీ ఆర్కిటెక్చర్‌ పై ఆధారపడి ఉంటుంది. అలాగే అధునాతన డిజైన్, ఫీచర్‌ లతో అందుబాటులో ఉంటుంది. ఏడిఏఎస్‌ హార్డ్‌వేర్‌ తో సహా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ తో ఈ టాటా హారియర్ ఈవీ 500 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

ముఖ్యంగా ఏడబ్ల్యూడీకు అనుకూలమైన కొత్త ఏసీటీఐ, ఈవీ ప్లాట్‌ఫారమ్‌తో హారియర్ ఈవీ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌తో ప్రారంభమవుతుందట. మరి ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే.. టాటా మోటార్స్ హారియర్ ఈవీను వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో సహా 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల అనుకూలీకరించదగిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జేబీఎల్‌ సోర్స్డ్ సౌండ్ సిస్టమ్, జేఎల్‌ఆర్‌ ప్రేరేపిత గేర్ లివర్, పాడిల్ షిఫ్టర్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు యాంబియంట్‌ వంటి వాటితో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా లైటింగ్‌ తో పాటు వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరి ఫైయర్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకర్షించడంతోపాటు కారుపై అంచనాలను పెంచేస్తున్నాయి.

Exit mobile version