Lectrix EV: మార్కెట్‌లోకి నయా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఫీచర్లు గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు మం

  • Written By:
  • Updated On - February 14, 2024 / 06:01 PM IST

ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉండడంతో వీటికి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎస్‌ఏఆర్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీలో భాగమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

ఈ ఈవీ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే చాలు 98 కి.లో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈవీ వాహనరంగంలో తమ స్కూటర్‌ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుందని లెక్ట్రిక్స్‌ ప్రతినిధులు చెబతున్నారు. లెక్ట్రిక్స్‌ ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 ఈవీ స్కూటర్‌ను ఒక సారి చార్జ్‌ చస్తే 98 కిలో మీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఈవీ స్కూటర్‌ ధర రూ.79,999 గా ఉంది. కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 స్కూటర్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అలాగే స్కూటర్‌ డెలివరీలు మాత్రం మార్చి 2024లో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు.

కొత్త లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఈవీ స్కూటర్ 2.2 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ హబ్ మోటార్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 60 కిలో మీటర్లుగా ఉంటుంది. 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, ఫాలో మీ హెర్ల్యాంప్ ఫంక్షన్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
లెక్ట్రిక్స్‌ ఈవీ ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 లాంచ్‌ సందర్భంగా ఆ సంస్థ ఎండీ, సీఈఓ కె.విజయ కుమార్ తమ సంస్థ తక్కువ ధరకే మంచి ఫీచర్లతో ఈవీ స్కూటర్లను అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొంటున్నారు. ఈవీ2 డబ్ల్యూ విస్తృత ఆమోదాన్ని నిర్ధారించడానికి మేము కలిగి ఉన్నామని పేర్కొన్నారు. లెక్ట్రిక్స్ కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో వారెంటీని అందిస్తోంది. ఈ ఈవీ ఈ ఈవీ స్కూటర్‌ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎస్‌ఓసీ, డోర్ స్టెప్ సర్వీస్ వంటి మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీ స్కూటర్‌ మొదటి దశలో దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ యూనిట్లను అమ్మకాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.