Site icon HashtagU Telugu

Bajaj Chetak: ఏంటి ఐఫోన్‌ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటరా.. బంపర్ ఆఫర్ ను ప్రకటించిన బజాజ్!

Bajaj Chetak

Bajaj Chetak

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఈ వీటికి పూర్తిగా మద్దతు ఉండడంతో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వీటితోపాటుగా ఇంకా మరిన్ని టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే బజాజ్ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గురించి మనందరికి తెలిసిందే.

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో బజాజ్‌ చేతక్‌ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను విడుదల చేసింది. చేతక్‌ 35 సిరీస్‌ లో భాగంగా 3501, 3502 పేర్లతో రెండు వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 3501 అనేది ప్రీమియం మోడల్‌. దీని ధర రూ.1.27 లక్షలు కాగా.. 3502 మోడల్‌ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఇదే సిరీస్‌ లో 3503 మోడల్‌ ను త్వరలో తీసుకురానున్నారు. అయితే ఐఫోన్‌ ఉన్న ధరల్లో ఈ స్కూటర్‌ ధరలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ స్కూటర్లు ధరలు కంటే ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. కాగా పాత చేతక్‌ ఎలక్ట్రిక్‌ మాదిరిగానే అదే క్లాసిక్‌ లుక్‌తో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది బజాజ్‌.

ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ ను అమర్చింది కంపెనీ. ఈ స్కూటర్ 73 కిలో మీటర్ల టాప్‌స్పీడ్‌ తో దూసుకెళ్తుంది. సింగిల్‌ ఛార్జ్‌ తో 153 కిలో మీటర్లు వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ చేయవచ్చని తెలిపింది. ఇందులో 5 అంగుళాల టచ్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించింది కంపెనీ. ఇందులో మ్యాప్స్‌ తో పాటు కాల్‌ ఆన్సర్‌/ రిజెక్ట్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. జియో ఫెన్స్‌, థెఫ్ట్‌ అలర్ట్‌, యాక్సిడెంట్‌ డిటెక్షన్‌, ఓవర్‌స్పీడ్‌ అలర్ట్‌ వంటి భద్రతాపరమైన ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి. 2020 నుంచి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. ప్రస్తుతం 3201, 3202, 2903, 3201 స్పెషల్‌ ఎడిషన్‌ పేర్లతో నాలుగు వెర్షన్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.