Car Care Tips: కారు టైర్ పంక్చర్ అయిందా.. పొరపాటున కూడా ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి?

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు తప్పనిసరిగా కారుని ఉపయోగిస్తున్నారు. మధ్యతరగతి వారు కూడా ఫ్యామిలీతో కలిసి అలా టూర్ కి ఇతర ఊర్లకు వ

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 06:31 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు తప్పనిసరిగా కారుని ఉపయోగిస్తున్నారు. మధ్యతరగతి వారు కూడా ఫ్యామిలీతో కలిసి అలా టూర్ కి ఇతర ఊర్లకు వెళ్లడం కోసం కారుని కొనుగోలు చేస్తున్నారు. ఇకపోతే కారుని తీసుకున్నప్పుడు చాలా మంది దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటే మరి కొంతమంది కారు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మామూలుగా మనం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కారు టైర్ పంక్చర్ అయితే వెంటనే స్టెఫ్నీ ని బిగిస్తూ ఉంటారు. అయితే కారు నడపడం వచ్చి టైర్ పంక్చర్ అయినప్పుడు టైరు ఎలా మార్చాలో తెలియని వారు చాలామంది ఉంటారు.

అటువంటి పరిస్థితిలో, చాలా సార్లు ప్రజలు కొన్ని తప్పులు చేస్తారు. అందుకే, టైర్ పంక్చర్ అయినప్పుడు కచ్చితంగా రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. మరి ఆ రెండు విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ కారు టైర్ పంక్చర్ అయినట్లయితే, ఆ పరిస్థితిలో కారును నడపకుండా ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పంక్చర్ అయిన టైర్‌తో కారును నడుపుతూ ఉంటే.. అప్పుడు టైర్ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో, మీరు కొత్త టైర్‌ని కొనుగోలు చేసి కారులో అమర్చవలసి ఉంటుంది. ఇది మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే కారు టైర్ పంక్చర్ అయినప్పుడు ఎప్పుడు కూడా రోడ్డు మధ్యలో కారును పార్క్ చేయవద్దు. టైర్ పంక్చర్ అయినప్పుడు కారును నడపకపోవడం అంటే మార్గమధ్యంలో కారును ఆపడం కాదు.

కారు టైర్ పంక్చర్ అయిందని తెలిసిన వెంటనే, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ఇతర వ్యక్తులు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా కారును రోడ్డు పక్కన పెట్టడం తోటి ప్రయాణికులకు ఇబ్బంది ఉండకపోవడంతో పాటు మన జాగ్రత్తలో కూడా మనం ఉన్నట్లు అవుతుంది. తరువాత ముందుగా స్టెప్నీ టైర్, టూల్‌బాక్స్‌ని బయటకు తీయండి. ఆపై జాక్ సహాయంతో, టైర్ పంక్చర్ అయిన కారు భాగాన్ని పైకి లేపండి. టైర్ గాలిలో పైకి లేచినప్పుడు టైర్ నట్ బోల్ట్ తెరిచి వాహనం నుంచి బయటకు తీయాలి. దాని స్థానంలో, మొదటి టైర్ మాదిరిగానే స్టెప్నీ టైర్‌ను భర్తీ చేయాలి. ఇప్పుడు మీరు తీసివేసిన నట్‌లు, బోల్ట్‌లను తిరిగి ఉంచండి. ఇక్కడ నట్‌లు, బోల్ట్‌లు బాగా బిగించబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. కారు కదులుతున్నప్పుడు అవి బయటకు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది జరిగితే ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు కారు కింద నుంచి జాక్‌ని తీసివేసి, పంక్చర్ అయిన టైర్‌ను స్టెప్నీ టైర్‌తో మార్చాలి.