Site icon HashtagU Telugu

Cars For Taxi : ట్యాక్సీ సర్వీసు కోసం నాలుగు బెస్ట్ కార్లు ఇవే..

Best Cars For Taxi Services

Cars For Taxi : చాలామంది స్వయం ఉపాధి కోసం సొంతంగా ట్యాక్సీ సర్వీసులను నడుపుతుంటారు. వాటి ద్వారా ఆదాయాన్ని గడిస్తూ జీవితాన్ని సాగిస్తుంటారు. ఈక్రమంలోనే ట్యాక్సీ సర్వీసుల కోసం ఏ కారు(Cars For Taxi) కొంటే బెటర్ అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు నాలుగు కార్ల మోడళ్లను ఇందుకోసం పరిశీలించవచ్చు. వాటి స్పెసిఫికేషన్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

హోండా అమేజ్

హోండా కంపెనీ కార్లు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. యూనిక్ డిజైన్‌తో కూడిన హోండా అమేజ్​ కారును కొనేందుకు మనం ప్రయారిటీ ఇవ్వొచ్చు. దీని ధర  రూ.8.54 లక్షల నుంచి రూ.11.64 లక్షల రేంజులో ఉంటుంది. ట్యాక్సీగా వాడుకునేందుకు ఈ కారు బెటర్. ఇందులో ఐదు సీట్లు ఉంటాయి. 1199 సీసీ ఇంజిన్‌తో ఇది నడుస్తుంది. సెడాన్ రకానికి చెందిన బాడీని కలిగి ఉంటుంది. ​

Also Read :Israel Vs Hamas : సొరంగంలో బందీల డెడ్‌బాడీస్.. హమాస్‌ కిరాతకం

మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6

మారుతి సుజుకీ ఎక్స్​ఎల్​6 కారు ట్యాక్సీ సర్వీసు కోసం చాలా బాగుంటుంది. ఇందులో 6 సీట్లు ఉన్నాయి.  ఈ కారులో ఎంయూవీ టైప్ బాడీ ఉంటుంది. మనదేశంలోని రోడ్లకు ఈ కారు చాలా స్యూటబుల్. రోడ్లపై ఎన్ని గతుకులు ఉన్నా.. ఈ కారు స్టేబుల్‌గా నడుస్తుంది. ఈ కారును పెళ్లిళ్లు, ఫ్యామిలీ ట్రిప్‌లకు వాడొచ్చు. ఈ కారులో ప్రయాణికులు కాళ్లు పెట్టుకునేందుకు తగినంత ప్రదేశం ఉంటుంది. దీనివల్ల ఇందులో జర్నీ చేయడంతో మంచి కంఫర్ట్ లభిస్తుంది. ఈకారులో 1462 సీసీ ఇంజిన్ ఉంది.  మారుతి సుజుకీ ఎక్స్​ఎల్​6 కారు ధర రూ.13.57 లక్షల నుంచి రూ.17.35 లక్షల వరకు ఉంది.

Also Read :Diktat For Employees : ఆఫీస్ టైంలో కాఫీకి వెళ్లొద్దు.. ఉద్యోగులకు కంపెనీ ఆర్డర్

హ్యుందాయ్ ఆరా 

హ్యుందాయ్ ఆరా కారులో 1197 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి. మంచి మైలేజీ కూడా ఇస్తుంది. దీనికి సెడాన్ రకానికి చెందిన బాడీ ఉంది. ట్యాక్సీ సర్వీసుకు వాడుకునేందుకు ఈ కారు చాలా బెస్ట్. దీని ధర రూ.7.66 లక్షల నుంచి రూ.10.46 లక్షల రేంజులో ఉంది.

టాటా టియాగో 

మంచి ఆల్ రౌండర్ కారు కోసం వెతుకుతున్న వారికిి బెస్ట్ ఆప్షన్.. టాటా టియాగో. ఈ కారులో 5 సీట్లు ఉంటాయి. దీనికి హ్యాచ్​బ్యాక్ రకానికి చెందిన బాడీ ఉంది. ​గతుకుల రోడ్లపై కంఫర్టబుల్ డ్రైవింగ్ కోసం ఈ కారు బెస్ట్. దీనిలోని సస్పెన్షన్​ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఈ కారులో 1199 సీసీ ఇంజిన్ ఉంది. ఈ కారు ధర రూ.6.73 లక్షల నుంచి రూ.9.33 లక్షల రేంజులో ఉంది.