MW Spartan 2.0 SUV: మహీంద్రా థార్ ఈవీకి పోటీగా సరికొత్త కారు.. ఫీచర్ల గురించి తెలిస్తే మతి పోవాల్సిందే?

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వాహనం వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతుం

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 04:30 PM IST

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వాహనం వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతుండడంతో వీటి కొనుగోలుదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉండడంతో వాహన తయారీ సంస్థలు ఎక్కువగా ఈవీ వాహనాలనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో దిగ్గజ సంస్థలతో పాటు పలు స్టార్టప్ లు కూడా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో సీజెక్ స్టార్టప్ కు చెందిన ఎండబ్ల్యూ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది.

ఎస్‌యూవీ వేరియంట్‌గా ఫోర్స్ గుర్ఖా మోడల్లో ఇది తయారైంది. ఈ ఎస్‌యూవీ స్పార్టన్ 2.0. ఇది చూడటానికి అచ్చం మహీంద్రా థార్ కారును పోలీ ఉంది. అలాగే జిమ్నీ మూడు డోర్ల కారుకు కూడా దగ్గరగా ఉంది. ఈ స్పార్టన్ 2.0 కారు సింగిల్ చార్జ్ పై 240 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఇకపోతే ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త కారు లో బాడీ షెల్, ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, సస్పెన్షన్, గేర్, ఇంటీరియర్ అంశాలన్నీ ఫోర్స్ మోటార్స్ అందించింది. బ్యాటరీ చైనా నుంచి తీసుకున్నారు. ఇతర విడి భాగాలు ఎండబ్ల్యూ సొంతంగా తయారు చేసింది. ఈ కారు తయారు చేసే ముందు స్పార్టన్ పాత వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొత్త స్పార్టన్ 2.0ను తమ ఇంజినీర్లు తయారు చేసినట్లు ఎండబ్ల్యూ ప్రకటించింది.

దీనిలో సింగిల్ మోటార్ ఉంటుంది. ఇది 176హెచ్పీ, 1,075 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ముందు వెనుక హిల్ డిసెంట్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైన లాకింగ్ వ్యవస్థను అందించారు. ఈ కారులో 57.4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ బానెట్ కింద ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. దీనిని 90కేడబ్ల్యూ చార్జర్ సాయంతో అరగంటలోనే 20 నుంచి 80శాతం వరకూ బ్యాటరీ ఫుల్ చేసుకోవచ్చు. బై డైరెక్షనల్ చార్జింగ్ కు అవకాశం ఉంటుంది. ఈ కారు 4,116 ఎంఎం పొడవు, 1,812 ఎంఎం వెడల్పు కలిగి ఉంటుంది. జిమ్నీ కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. గుర్ఖా ఆధారిత స్పార్టన్ 2.0 కెర్బ్ వెయిట్ 2,350కేజీలు ఉంటుంది. స్పెన్షన్ కోసం కోయిల్ స్ప్రింగ్స్, యాంటీ రోల్ బార్స్ ముందు, వెనుకు ఉంటాయి. ఇంటీరియర్ లో ముందు వైపు అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి. టూ వే అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ విండోస్, ఏసీ, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోకి ఎప్పుడు వస్తుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.