Site icon HashtagU Telugu

Motorola Edge 50 Neo Launch: త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!

Mixcollage 22 Jul 2024 10 18 Am 5097

Mixcollage 22 Jul 2024 10 18 Am 5097

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అంతే కాకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ని కూడా అందిస్తోంది. ఇది ఇలా ఉండే మోటోరోలా సంస్థ త్వరలో కొత్త స్మార్ట్ ఫోన్‌ ను మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్లను ప్రవేశపెడుతోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా నుంచి మోటోరోలా రెజర్ 50 సిరీస్ వరకు లాంచ్ అవుతోంది. అయితే లెనోవో సబ్ బ్రాండ్ గత ఏడాదిలో మోటోరోలా ఎడ్జ్ 40 నియోకు అప్‌గ్రేడ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 నియోను త్వరలో లాంచ్ చేయవచ్చని ఇప్పుడు లీక్‌లు సూచిస్తున్నాయి. ఇకపోతే ఈ మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో 6.4 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి జీ615 జీపీయూ కలిగి ఉంటుంది.

కాగా ఇదే ప్రాసెసర్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లో చివరిగా కనిపించింది. కెమెరా విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ సెకండరీ సెన్సార్, 10ఎంపీ సెన్సార్ కూడా ఉండవచ్చు. అదే సమయంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 32 ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చట. ఈ స్మార్ట్‌ఫోన్ 4,310mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 256జీబీ వరకు స్టోరేజీ తో వస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హలో యూఐతో రన్ కావచ్చు.

అలాగే మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.3, ఎన్ఎఫ్‌సీ ఐపీ68 ప్రొటెక్షన్ కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. 71.2ఎమ్ఎమ్ x 154.1ఎమ్ఎమ్ x 8.1ఎమ్ఎమ్ కొలతలతో రావచ్చు. 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్, పోయిన్సియానా వంటి 4 కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇకపోతే ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ కాగా రూ. 22,999 కాగా 12జీబీ ర్యామ్ మోడల్‌కు రూ. 24,999గా నిర్ణయించింది.