Site icon HashtagU Telugu

Most Affordable Cars: బడ్జెట్ కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే ఈ కార్లపై ఒక లుక్కేయండి!

Mixcollage 01 Jul 2024 09 16 Am 8990

Mixcollage 01 Jul 2024 09 16 Am 8990

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా బడ్జెట్ కార్ల వైపే ముగ్గు చూపుతున్నారు. మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు సరసమైన ధరలో అందుబాటులో ఉండే కార్ల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. మీరు కూడా అలా సరసమైన ధరలో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది మీకోసమే. ఎందుకంటే భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో టాప్ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 5 లక్షల లోపు కార్ల కోసం వెతుకుతుంటే ఇదే మీకు సరైన అవకాశం అని చెప్పాలి. కేవలం మూడు ఆప్షన్లలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ కార్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఏదైనా ఎంచుకుని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మరి ఆ మూడు కార్లకూ సంబంధించిన ధర ఫీచర్లు స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..

మారుతి సుజుకి ఆల్టో కె10.. ఆల్టో ఇండియా లో ఉన్న అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఇది కూడా ఒకటి. అలాగే భారత్ లో ఎక్కువగా అమ్ముడైన కారు కూడా ఇదే. ఆల్టో 800 గత ఏడాదిలో నిలిపివేయగా ఇప్పుడు ఆల్టో K10ని మాత్రమే పొందవచ్చు. ఆల్టో కె10 ప్రారంభ ధర రూ. 3.99 లక్షలుగా ఉంది. ఈ కారు 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 67PS గరిష్ట శక్తిని, 89Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. మీరు రూ. 5 లక్షల లోపు మాన్యువల్ ఆప్షన్ 5 స్పీడ్ మాత్రమే పొందుతారు.

మరొక కారు మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో.. ఈ సుజుకి ఎస్-ప్రెస్సో మారుతి అందించే మరో సరసమైన మోడల్. కాగా దీని ప్రారంభ ధర రూ. 4.26 లక్షలుగా ఉంది. ఎస్-ప్రెస్సో ఆల్టో కె10లో ఇంజన్‌ను కలిగి ఉంది. అలాగే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కారు బేస్ వేరియంట్ మాత్రమే రూ. 5 లక్షల లోపు లభిస్తుంది.

రెనాల్డ్ క్విడ్.. ఈ కారు ఒకప్పుడు 0.8 లీటర్,1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులో ఉండేది. అయితే గత ఏడాది చిన్న ఇంజిన్‌ ను తొలగించగా ఇప్పుడు పెద్ద ఇంజిన్‌గా మిగిలిపోయింది. క్విడ్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలుగా ఉంది. క్విడ్ 1.0 లీటర్ ఎస్‌సీఈ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 68పీఎస్ శక్తిని 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. రూ. 5 లక్షల లోపు, మీరు 5-స్పీడ్ ఎంటీ మాత్రమే పొందుతారు. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో నేటి కార్లు ఖరీదైనవిగా మారాయి. ఇన్‌పుట్ ఖర్చులలో మెటీరియల్ ఖర్చులు అత్యధికంగా పెరిగాయి.