Mini Cooper EV: మార్కెట్ లోకి మినీ కూపర్ ఈవీ.. ధర, ఫీచర్స్ ఇవే?

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇందన ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎ

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 07:50 PM IST

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇందన ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ముగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాహన తయారీ సంస్థలు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలనే మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. ఈవీ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన తర్వాత, చాలా మంది కార్ల తయారీదారులు తమ ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడం లేదా కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. బీఎండబ్ల్యూ యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ అయిన మినీ కూడా ఈ ట్రెండ్‌లో చేరింది.

మ్యూనిచ్‌లో ఐదో జనరేషన్ ఆల్-ఎలక్ట్రిక్ కూపర్, కొత్త మినీ కంట్రీమ్యాన్ కార్లను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన కారు కంపెనీ వ్యూహంలో ఓ భాగం. మొత్తం పోర్ట్‌ఫోలియోను స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మినీ బ్రాండ్ 2025 నాటికి పలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతోంది. ఇప్పటికే కంపెనీ కొన్ని ప్రముఖ ఆటోమేకర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇటీవల ఈవీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. అందులో భాగంగానే కొత్త కార్లను పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్స్ ఇండియాలో వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మినీ కూపర్ ఈవీ విషయానికి వస్తే..

ఇందులో కంపెనీ సిగ్నేచర్ స్టైల్ 9.4-అంగుళాల OLED ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంది. కుడివైపు కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయి. క్యాబిన్ లోపల సొగసైన, ఫ్యూచరిస్టిక్ వైబ్ కనిపిస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్, ఆటోకార్‌ప్లేతో సహా అన్ని కార్ కనెక్ట్ టెక్నాలజీతో ప్రత్యేకమైన యూనిట్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ గతంలో ఉన్న మోడల్స్‌తో పోలిస్తే మరింత క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. అనేక ఫీచర్స్ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రెండు వేరియంట్లలో పరిచయం చేయబడింది. ఇందులో ఈ అనేది బేస్ మోడల్. ఫ్రంట్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇందులో 40.7kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 181bhp శక్తిని, 290Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక హైఎండ్ మోడల్ SE పేరుతో అందుబాటులో ఉంది. ఇది 54.2kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 215 bhp శక్తిని, 330 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ మోడల్ 402కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది.