Michael Jordan: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు.. రూ. ధర తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే?

ఇటీవల కాలంలో కేవలం సినిమాలకు సంబందించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ కు సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఖరీదైన వస్తువులను వాహనాలను కొన

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 07:25 PM IST

ఇటీవల కాలంలో కేవలం సినిమాలకు సంబందించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ కు సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఖరీదైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక బాస్కెట్ బాల్ దిగ్గజ ఆటగాడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కారుని కొనుగోలు చేసి వార్తలు నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాస్కెట్‌ బాల్ దిగ్గజం, మాజీ ఎన్‌బీఏ స్టార్‌ మైఖేల్ జోర్డాన్‌ తన ఆసక్తికి తగ్గట్టుగానే మరో ఫాస్టెస్ట్‌ కారును సొంతం చేసుకున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, కన్వర్టిబుల్‌ కార్‌ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్‌ను కొనుగోలు చేశాడు. కాగా ఆ కార్ ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఆ కారు ఐదు పది కోట్లు కాదండోయ్ ఏకంగా రూ. 29 కోట్ల రూపాయలు. బాస్కెట్‌ బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడైన జోర్డాన్‌ హైపర్‌, సూపర్‌, స్పోర్ట్స్ కార్ల కలెక్షన్‌కు పెట్టింది పేరు. అందులోనూ అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే అతనికి పిచ్చి. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్‌ కారు ఇప్పటికే గ్యారేజీ లో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి లాంటి లెజెండ్రీ కార్లు కూడా ఉన్నాయి.

తాజాగా అమెరికన్ హెన్నెస్సీ వెనమ్ ఎఫ్5 రోడస్టర్‌ కారు కూడా చేరింది. ప్రపంచంలో కేవలం 30 మంది ఓనర్లలో మైఖేల్ జోర్డాన్‌ ఒకరు. హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జోర్డాన్‌తో పోటోను కంపెనీ సీఈవో జాన్ హెన్నెస్సీ ట్వీట్‌ చేశారు. ప్రత్యేకమైన రోజు, స్పెషల్‌ ఫ్రెండ్‌ ​కోసం స్పెషల్‌ వెనమ్‌ ఎఫ్5ని అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు. అద్భుతమైన ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌న్‌, 1,842 హార్స్‌పవర్‌, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0 – 100 kmph వేగంతో గరిష్ట వేగంతో గంటకు 498 కి.మీ.ని అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం కేవలం 30 కార్లు మాత్రమే తయారైనాయి. ధర 3 మిలియన్‌ డాలర్లు. ప్రపంచం లోని అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్ కారుని కంపెనీ ప్రకటించింది.