MG Motors : ఎంజీ మోటార్స్ ఈ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్.. రూ.లక్షల్లో డిస్కౌంట్..

ఇయర్ ఎండ్ లిస్టులో ఎంజీ మోటార్స్ ఇండియా (MG Motors India) కూడా చేరింది. కంపెనీ డిసెంబర్ ఫెస్ట్ పేరుతో ఇయర్ ఎండ్ ఆఫర్ లను అందిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 06:20 PM IST

MG Motors : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ వచ్చే ఏడాది అనగా 2024 జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన మోడళ్ల ధరలు 2024 జనవరి 1 నుంచి పెరుగుతాయని అనౌన్స్ చేశాయి. అయితే ఈ ఆందోళనకు చెక్ పెట్టేలా వివిధ కంపెనీలు ప్రస్తుత డిసెంబర్‌లో ఇయర్ ఎండ్ ఆఫర్ లను అందిస్తున్నాయి. కొత్త కార్లు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఇయర్ ఎండ్ లిస్టులో ఎంజీ మోటార్స్ ఇండియా కూడా చేరింది. కంపెనీ డిసెంబర్ ఫెస్ట్ పేరుతో ఇయర్ ఎండ్ ఆఫర్ లను అందిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని మోడళ్లపై ఈ నెలాఖరు వరకు ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

We’re now on WhatsApp. Click to Join.

MG ZS EV.. ఎంజీ కంపెనీ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ SUV ‘MG ZS EV కార్ లని డిసెంబర్ ఫెస్ట్ ఆఫర్లలో రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వర్తిస్తుంది. MG ZS EV ధరలు రూ. 22.88 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు ఉంటాయి.

MG Comet.. ఎంజీ కంపెనీ అందిస్తున్న డిసెంబర్ ఫెస్ట్ ఆఫర్లలో ఎంజీ కామెట్‌ ఈవీని రూ.65,000 వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 7.98 లక్షల నుంచి రూ. 10.63 లక్షల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 230 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. వెహికల్ బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేయడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.

MG Aster.. హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న ఎంజీ ఆస్టర్ SUVని ఇప్పుడు రూ.1,00,000 వరకు బెనిఫిట్స్, రూ. 50,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఆస్టర్ ఎస్‌యూవీ 1.3L టర్బో-పెట్రోల్, 1.5L NA పెట్రోల్ ఇంజిన్ వంటి రెండు ఇంజిన్ ఆప్షన్ లలో లభిస్తుంది.

MG Hector.. ఎంజీ హెక్టర్ ప్రస్తుతం రూ.1 లక్ష డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MG Gloster.. ఎంజీ నుంచి వచ్చిన ప్రీమియం గ్లోస్టర్ SUVని ఇప్పుడు రూ.1,00,000 వరకు బెనిఫిట్స్, రూ. 50,000 ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. గ్లోస్టర్ ధర రూ.38.80 లక్షలుగా ఉంది. ఇది 2.0L టర్బో-డీజిల్‌ ఇంజిన్‌తో, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Also Read:  Spicejet: స్పైస్‌జెట్‌కు భారీ ఊరట.. రూ. 1100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ముంబై జంట..!