Site icon HashtagU Telugu

MG Comet EV: ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు శుభవార్త. భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ కారు ధర?

Mixcollage 04 Feb 2024 03 24 Pm 3412

Mixcollage 04 Feb 2024 03 24 Pm 3412

గత ఏడాది ఎంజీ కామెట్ అనే ఒక ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కారుకు మంచి ఆదరణ కూడా లభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు సిటీ పరిధిలో బాగా సరిపోతుండడంతో చాలామంది వాహన వినియోగదారులు ఈ కారును కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఎంజీ మరో అడుగు వేస్తూ ఈ కారు ధరలను సవరించింది. దాదాపు రూ. లక్ష వరకూ తగ్గింపును అందిస్తోంది. వాస్తవానికి దీని లాంచ్‌ అప్పుడు బేస్‌ వేరియంట్‌ ధర రూ. 7.98లక్షలు ఉండగా.. ఇప్పుడు లేటెస్ట్‌ తగ్గింపుతో ఇది ఇప్పుడు రూ. 6.99లక్షలకే లభ్యమవుతోంది.

అంటే రూ. 99,000 తగ్గింపుతో ఉంటుంది. ఈ ధరలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ ధర కంటే ఇది తక్కువకే లభ్యమవుతోంది. మారుతీ సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ టాప్‌ వేరియంట్‌ 1.2ఎల్‌ జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏజీఎస్‌ వేరియంట్‌ ధర రూ. 7.25లక్షలు ఉంటుంది. వాస్తవానికి ఈ వ్యాగన్‌ ఆర్‌ ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్‌, సిటీ పరిధికి కావాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. కాగా ఇ ఎంజీ కామెట్ 17.3 కేడబ్ల్యూహెచ్‌ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇది 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 41.5 బీహెచ్‌పీ, 110 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3.3కేడబ్ల్యూహెచ్‌ చార్జర్‌ సాయంతో 7 గంటల్లో 0-100% నుంచి ఛార్జ్ చేయగలగుతుంది. కామెట్ కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది నగరంలోని ట్రాఫిక్‌ చాలా సులువుగా వెళ్లగలుగుతుంది. ఈ చిన్న కారు అయినప్పటికీ ఫీచర్‌ ప్యాక్డ్‌ గా ఉంటుంది. దీనిలో 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ లైట్లు, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్‌ ఆపిల్ కార్‌ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా, డిజిటల్ బ్లూటూత్ కీ, స్మార్ట్ కనెక్ట్ అయిన కారుతో వస్తుంది. కారు నుంచే నోటిఫికేషన్లను, ముఖ్యమైన డేటాను నియంత్రించడానికి, స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీలో పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్‌లు ఉన్నాయి, పేస్ బేస్ వేరియంట్, ప్లష్ టాప్ ఎండ్ వేరియంట్. మీ కారును నిజంగా వ్యక్తిగతీకరించడానికి, మిగిలిన వాటి కంటే భిన్నంగా కనిపించేలా చేయడానికి ఎంచుకోవడానికి వివిధ రంగులు, స్టైల్ ప్యాక్‌లు ఉన్నాయి.

Exit mobile version