Tata Nexon: టాటా ఈవీ కారుపై అదిరిపోయే డిస్కౌంట్.. ఏకంగా అన్ని లక్షల తగ్గింపు?

ఇటీవల కాలంలో భారత్ లో ఈవీ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన అనూహ్య డిమాండ్ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ కార్లను విడుద

  • Written By:
  • Updated On - March 12, 2024 / 06:16 PM IST

ఇటీవల కాలంలో భారత్ లో ఈవీ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన అనూహ్య డిమాండ్ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ ను ఎక్కువగా ఈవీ కార్లు ముంచెత్తుతున్నాయి. మార్కెట్‌ లో పెరిగిన పోటీ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈవీ కార్ల కొనుగోలుపై కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించిన ఫేస్లిఫ్ట్, ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్లకు తగ్గింపులను ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ ఎంవై 2023తో పరిమిత సంఖ్యలో యూనిట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అనేక బ్రాండ్లు తమ మోడల్ పై డిస్కౌంట్లను అందిస్తున్నందున ఈ ప్రమోషన్ ముఖ్యమైన సమయంలో వస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ప్రీ-ఫేస్క్రిఫ్ట్ వెర్షన్ రూ. 3.15 లక్షల భారీ తగ్గింపును పొందుతోంది. ప్రైమ్ రూ. 2.30 లక్షల తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. అలాగే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 2.65 లక్షల మరింత ఎక్కువ తగ్గింపును పొందుతుంది.

టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ప్రీ-ఫేస్క్రిఫ్ట్ వెర్షన్ 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 129 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. దీని వల్ల వాహనం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 312 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు, ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మాక్స్ వేరియంట్ పెద్ద 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు 143 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. అలాగే ఒక ఛార్జ్‌పై 436 కిమీల పరిధిని అందించగలదు. అలాగే టాటా నెక్సాన్ ఈవీ 2023 మోడల్ పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎంవై 2024 యూనిట్లు రూ.20,000 గ్రీన్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మోడల్‌కు ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించఫేస్లిఫ్ట్ వెర్షన్‌పై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ లేదు.

టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభిన్న బ్యాటరీ ప్యాక్ తో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ , లాంగ్ రేంజ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీడియం రేంజ్ మోడల్స్‌లో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 325 కి.మీల పరిధిని అందిస్తుంది. మరోవైపు లాంగ్ రేంజ్ వేరియంట్లో 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే 465 కిమీ పరిధిని అందిస్తుంది.