Maruti Suzuki: మార్కెట్లోకి రానున్న రెండు హై మైలేజీ మారుతీ కార్లు.. ధర, ఫీచర్లు ఇవే?

ఇండియాలో అతి పెద్ద కార్ల త‌యారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటికే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో

  • Written By:
  • Updated On - November 23, 2022 / 05:52 PM IST

ఇండియాలో అతి పెద్ద కార్ల త‌యారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటికే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో రకరకాల మోడల్స్ కార్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మార్కెట్ లో బుల్లి కార్లకు గణనీయ మార్కెట్ ఉంది అని నమ్ముతున్న మారుతి ఎంట్రీ లెవ‌ల్ కార్లలో మారుతి వాటా 90 శాతం పైనే. అందుకే ఎంట్రీ లెవ‌ల్ కార్లతోపాటు కంపాక్ట్ సెడాన్ కార్ల ఆవిష్కర‌ణ‌ పై కేంద్రీక‌రించింది. కాగా ఈ ఏడాది న్యూ జ‌న‌రేష‌న్ సెలేరియో, ఆల్టో కే10 మోడ‌ల్స్‌ను మార్కెట్‌ లోకి తీసుకొచ్చిన మారుతి సుజుకి 2024 లో హ్యాచ్‌బ్యాక్‌, కంపాక్ట్ సెడాన్‌ల‌ను ఆవిష్క‌రించేందుకు సిద్ధపడుతోంది.

కాగా ఈ న్యూ జ‌న‌రేష‌న్ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్‌, డిజైర్ కంపాక్ట్ సెడాన్ కార్ల‌ను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. మైలేజీతో పాటు హైబ్రీడ్ టెక్నాల‌జీ కార్లతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళిక‌లను సిద్ధం చేస్తోంది మారుతీ. ఈ ఏడాది మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, డిజైర్ కంపాక్ట్ కార్లు 1.2 లీట‌ర్లు, 4 సిలిండ‌ర్ కే12ఎన్ డ్యుయ‌ల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో లభించనున్నాయి. 90బీహెచ్పీ ప‌వ‌ర్‌, 113 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తాయి. 5 స్పీడ్ మాన్యువ‌ల్, ఏఎంటీ గేర్‌ బాక్స్‌ తో అందుబాటులో ఉండనున్నాయి. ఈ న్యూ స్విఫ్ట్‌, న్యూ డిజైర్ కార్లు లీట‌ర్‌కు 30-40 కిలోమీట‌ర్ల మైలేజీ ఇస్తాయ‌ని ఇస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ కార్లు యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. ఇప్పుడు స్విఫ్ట్ కారు రూ.5.92 నుంచి 8.85 ల‌క్ష‌ల మ‌ధ్య‌ ఉండగా డిజైర్ రూ.6.24 నుండి 9.18 ల‌క్ష‌ల మ‌ధ్య ల‌భిస్తున్నాయి. 2024 స్విఫ్ట్‌, డిజైర్ కార్లు రూ.ల‌క్ష నుంచి రూ.1.50 ల‌క్ష‌లు అధికంగా ప‌లికే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యూ జ‌న‌రేష‌న్ స్విఫ్ట్‌, డిజైర్ కార్ల‌లోని ఫీచ‌ర్లు త్వరలోనే తెలియనున్నాయి.