Maruti Suzuki Swift: మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!

భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ కార్లపై భారీగా ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల మే నెలలో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గో జనరేషన్ మోడల్‌ ను లాంచ్

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 11:30 AM IST

భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ కార్లపై భారీగా ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల మే నెలలో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గో జనరేషన్ మోడల్‌ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కారు విడుదల అయినప్పటి నుంచి మార్కెట్లో ఈ మోడల్ కారుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక విడుదల అయినప్పటి నుంచి గత రెండు నెలల్లో 35,815 యూనిట్ల వద్ద వాల్యూమ్‌ లను సంపాదించింది. ఆ సంగతి అటు ఉంచితే మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఈ మారుతీ సుజుకి కారు కొనుగోలు చేయాల్సిందే.

మారుతి 2024 స్విఫ్ట్‌ కారు తయారీ కోసం మొత్తం రూ.1,450 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ హ్యాచ్‌ బ్యాక్ కొత్త జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 82పీఎస్ పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ ఎంటీ, 5 స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్ అన్ని ఎంటీ, ఎఎంటీ వేరియంట్‌ లు మొత్తం 17,100 రూపాయల తగ్గింపుతో ఉన్నాయి. అలాగే ఈ కారులో రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు సంస్థాగత విక్రయాల ఆఫర్ లను అందిస్తోంది. కాగా ఈ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారు LXi, VXi, VXi(O), ZXi, ZXi+ వంటి ఐదు వేరియంట్ లలో లభిస్తున్నాయి.

కాగా ఈ కార్ల ధరల విషయానికి వస్తే.. స్విఫ్ట్ ఎల్‌ఎక్స్ఐ ఎంటీ – రూ. 6.49 లక్షలు కాగా, స్విఫ్ట్ విఎక్స్ఐ ఎంటీ – రూ. 7.29 లక్షలుగా ఉంది. అలాగే స్విఫ్ట్ విఎక్స్ఐ ఎఎంటీ – రూ. 7.74 లక్షలు కాగా, స్విఫ్ట్ విఎక్స్ఐ (o) ఎంటీ – రూ. 7.56 లక్షలుగా ఉంది. స్విఫ్ట్ విఎక్స్ఐ (o) ఎఎంటీ – రూ. 8.01 లక్షలు కాగా, స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎంటీ – రూ. 8.29 లక్షలుగా ఉంది. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎఎంటీ – రూ. 8.74 లక్షలు కాగా, స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ ప్లస్ ఎంటీ – రూ. 8.99 లక్షలుగా ఉంది. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎఎంటీ – రూ. 9.44 లక్షలు కాగా, స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.14 లక్షలుగా ఉంది. అలాగే స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.59 లక్షలుగా ఉంది.2024 స్విఫ్ట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBD, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ABS వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. కొత్త స్విఫ్ట్ బూమరాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, 15 అంగుళాల ప్రెసిషన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ లతో ఫ్రంట్ గ్రిల్ వంటి ఎక్స్‌టీరియర్ ఫీచర్లతో వస్తుంది. క్యాబిన్ లోపల స్మార్ట్‌పే ప్రో ప్లస్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2 అంగుళాల ఎంఐడీతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆర్కమైస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Follow us