Site icon HashtagU Telugu

Maruti Suzuki: మారుతి కార్లపై డిస్కౌంట్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?

Maruti Suzuki Stock

Maruti Suzuki

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతి సుజికీ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన కార్లపై డిస్కౌంట్ ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మినీ కార్లపై డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఆల్టో, ఎస్‌ ప్రెస్‌ కార్ల అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో తాజాగా మారుతీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మినీ కార్ల అమ్మకాలు 10,648 యూనిట్లకు పడిపోయాయి. కాగా గత ఏడాది ఆగస్టులో 12,209 యూనిట్ల అమ్మకాలు జరగగా ఈ ఏడాది 10,648కి తగ్గింది. ఇకపోతే మారుతి సుజుకి అందించిన డిస్కౌంట్ ల విషయానికి వస్తే..

ఎస్‌ ప్రెసో LXI పెట్రోల్‌ వేరియంట్‌ ధరను రూ.2,000 తగ్గించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కే10 VXI పెట్రోల్‌ వెర్షన్‌ ధరను రూ.6,500 తగ్గించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తగ్గించిన ఈ అమ్మకాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కంపెనీ తాజాగా సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. తగ్గించిన ధరలతో ఆల్టో కే10 ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 3.99 లక్షలుగా ఉంది. కాగా హై ఎండ్ కారు ధర రూ. 5.96 లక్షలకు లభిస్తోంది. ఇకపోతే ఎస్‌ప్రెస్సో విషయానికొస్తే.. దీని ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల మధ్య ఉంది.

వీటితో పాటుగా బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి మోడల్స్‌ లో కూడా 20 శాతం సేల్స్‌ తగ్గడం గమనార్హం. ఈ అన్ని కార్లు గత ఏడాది 72,451 యూనిట్లతో పోలిస్తే 58,051 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి ఆగస్టు 2024లో మొత్తం అమ్మకాలలో సంవత్సరానికి 4 శాతం క్షీణతను ప్రకటించింది. కంపెనీ గత నెలలో 1,81,782 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో 1,89,082 యూనిట్లు అమ్ముడయ్యాయట. మొత్తం మీద దేశంలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఆగస్టు 2023లో అమ్మకాలు 1,56,114 యూనిట్ల నుంచి 1,43,075 యూనిట్లకు పడిపోయాయి. ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్ల అమ్మకాలు తగ్గాయి.

Exit mobile version