Maruti Suzuki: మారుతీ సుజుకీ 9,925 కార్ల రీకాల్‌.. కారణమిదే..?

మారుతీ సుజుకీ ఇండియా 9,925 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 03:36 PM IST

మారుతీ సుజుకీ ఇండియా 9,925 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్‌, సెలెరియో, ఇగ్నిస్‌కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్‌ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు ౩ నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ తన మూడు మోడళ్లైన వేగనార్‌, సెలెరియో, ఇగ్నిస్‌లలో 9,925 యూనిట్లను రీకాల్ చేస్తోంది. ఆగస్ట్ 3- సెప్టెంబర్ 1, 2022 మధ్య తయారు చేయబడిన కార్లలో ఈ లోపం ఉందని సంస్థ తెలిపింది.

“వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో (‘పార్ట్’) లోపం ఉందని అనుమానం ఉంది. ఇది ఒక నిర్దిష్ట సమయంలో విరిగిపోయి విచిత్రమైన శబ్దాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో బ్రేక్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు. కస్టమర్ల భద్రత, ముందు జాగ్రత్తల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసి భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది” అని మారుతి సుజుకీ తన బిఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది.

దెబ్బతిన్న లేదా లోపాలున్న విడిభాగాలను ఎటువంటి చార్జీ లేకుండా అమర్చి తిరిగి కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకి శుక్రవారం స్టాండ్‌లోన్ నికర లాభం సంవత్సరానికి (YoY) నాలుగు రెట్లు ఎక్కువ పెరిగి రూ. 2,062 కోట్లకు చేరుకుంది. త్రైమాసికంలో కంపెనీ ఆదాయం దాదాపు 46 శాతం పెరిగి రూ. 29,931 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో మొత్తం అమ్మకాల పరిమాణం మునుపటి సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువగా 517,395 యూనిట్లుగా ఉంది.