Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) భారతదేశంలో ప్రారంభించినప్పటి నుండి దాని అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికి ప్రధాన కారణం దాని అధిక ధర. దీని విక్రయాలు నిరంతరం పడిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ SUV పై భారీ తగ్గింపులను అందిస్తోంది. డిసెంబర్ నెలలో మారుతి సుజుకి తన ప్రీమియం SUV జిమ్నీపై మంచి తగ్గింపును అందించింది. మీరు ఈ నెలలో ఈ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు దానిపై చాలా మంచి తగ్గింపును పొందుతారు. జిమ్నీపై రూ.2.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు చాలా కాలంగా కొనసాగుతోంది.
పండుగ సీజన్‌లో కూడా ఇదే విధమైన తగ్గింపు కంపెనీ అందించింది. అయితే ఇది వినియోగదారులను ఆకర్షించడంలో ప్రభావం చూపింది. మారుతి జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల వరకు ఉంది. ఈ SUV ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Also Read: World Chess Championship: ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్
ఇంజిన్- పవర్
ఇంజన్ గురించి మాట్లాడుకుంటే.. జిమ్నీ 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది ఒక లీటర్‌లో 16.94 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4 వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఇది పరిమాణంలో కాంపాక్ట్ అయినప్పటికీ బలంగా ఉంటుంది. ఇందులో స్పేస్ కూడా ఉంటుంది. మారుతీ సుజుకీ ఎంత డిస్కౌంట్ ఇచ్చినా అమ్మకాలు పెంచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. బడ్జెట్ సమస్యలు లేకుంటే మీరు జిమ్నీని కొనుగోలు చేయొచ్చు. భద్రత కోసం, జిమ్నీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ EBD, 4 వీల్ డ్రైవ్, EPS, బ్రేక్ అసిస్ట్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. జిమ్నీలో 5 మంది కూర్చోవచ్చు.
మారుతి గ్రాండ్ విటారాపై కూడా భారీ తగ్గింపు
మీరు మారుతి సుజుకి గ్రాండ్ విటారాను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో ఈ SUVపై రూ. 1.03 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండవ కాంపాక్ట్ SUV. మారుతి గ్రాండ్ విటారా ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 20.09 లక్షల వరకు ఉంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. భద్రత కోసం ఈ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ EBD సౌకర్యం ఉంది.