Maruti Jimny Discount: SUV కార్లపై ఏకంగా లక్షలు తగ్గించిన మారుతి.. ఆఫర్లు తెలిస్తే నోరెళ్లట్టాల్సిందే?

తాజాగా మారుతీ జిమ్నీ SUV పై భారీగా తగ్గింపు ధరని ప్రకటించింది. కాగా సదరు కంపెనీ ఏడాది జూన్ 2023లో జిమ్నీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 04 Dec 2023 03 45 Pm 3050

Mixcollage 04 Dec 2023 03 45 Pm 3050

తాజాగా మారుతీ జిమ్నీ SUV పై భారీగా తగ్గింపు ధరని ప్రకటించింది. కాగా సదరు కంపెనీ ఏడాది జూన్ 2023లో జిమ్నీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ ధరపై ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. వినడానికి చాలా సంతోషంగా ఎక్సైటింగ్ గా ఉన్న ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మారుతి సుజుకి జిమ్నీని జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్ లలో అందిస్తోంది.అయితే కంపెనీ ఇటీవలే థండర్ ఎడిషన్‌ను రూ.10.75 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇంతకుముందు జిమ్నీ జీటా ఎంటీ ధర రూ.12.74 లక్షలు ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభమైంది.

అయితే ఇప్పుడు కంపెనీ దీని ధరను రూ.2 లక్షలు తగ్గించింది. ఇప్పుడు జిమ్నీ ప్రారంభ ధర రూ.10.74 లక్షలుగా ఉంది. కాగా జిమ్నీ జీటా ఆటోమేటిక్ పాత ధర రూ.13.94 లక్షలు కాగా, ఇప్పుడు దీని ధర కేవలం రూ.11.94 లక్షలు. అంటే జిమ్ని రెండు లక్షల తగ్గింపు ధరతో 11 లక్షలకే ఈ కారుని అందిస్తోంది. ఈ ట్రిమ్ ధరను కూడా రూ.2 లక్షలు తగ్గించింది. జిమ్నీ ఆల్ఫా MT కొత్త ధర ఇప్పుడు రూ.12.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ దీని ధరను రూ.లక్ష తగ్గించింది. జిమ్నీ ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ డ్యూయల్ టోన్ ధర గతంలో రూ.13.85 లక్షలు కాగా, ఇప్పుడు లక్ష రూపాయల తగ్గింపుతో రూ.12.85 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఆల్ఫా ఆటోమేటిక్ కూడా ఇప్పుడు కొత్త ధర రూ.13.89 లక్షలుగా ఉంది.

జిమ్నీ ఆల్ఫా ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ కొత్త ధర రూ.14.05 లక్షలు. దీని ధర కూడా రూ.లక్ష తగ్గింది. ఇకపోతే వీటి ఫీచర్ల విషయానికొస్తే.. మారుతి జిమ్నీలో 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 105 bhp శక్తిని, 134Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. జిమ్నీ రెండు వేరియంట్‌ లలో 4-వీల్ డ్రైవ్‌ట్రెయిన్ ప్రామాణికంగా లభిస్తోంది. జిమ్నీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. భద్రత పరంగా, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్‌వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. జిమ్నీ యొక్క అన్ని మోడళ్లలో హార్డ్ టాప్ రూఫ్ అందుబాటులో ఉంది. కాగా ఈ కార్లపై ఏకంగా 1,2 లక్షలు తగ్గింపు ధరని ప్రకటించడంతో కారు కొనుగోలుదారులు షోరూమ్ కి పరుగులు తీస్తున్నారు.

  Last Updated: 04 Dec 2023, 03:47 PM IST