Site icon HashtagU Telugu

Maruti Suzuki: కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతి సుజుకి.. రూ.60 వేల తగ్గింపు?

Maruti Suzuki

Maruti Suzuki

త్వరలో వినాయక చవితి రాబోతోంది. ఈ సందర్భంగా వాహన తయారీ సంస్థలు కంపెనీలు వాహనాలపై భారీగా డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి పలు కార్లపై భారీ డిస్కౌంట్‌ లను ప్రకటించింది. కంపెనీ లైనప్‌లో ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్‌ఆర్‌, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్‌, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్‌ మోడల్స్‌ ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి దాని నెక్సా చైన్ అవుట్‌లెట్‌ల ద్వారా ఎంపిక చేసిన మోడల్‌లను రిటైల్ చేస్తుంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్‌ పరంగా టాప్‌ పొజిషన్‌లో నిలిచిన మారుతి, పండుగ సీజన్‌లో సేల్స్‌ మరింత పెంచుకోవడంపై ఫోకస్‌ చేసింది.మరి ఆ ఆఫర్ల విషయానికొస్తే.. మారుతి సుజుకి స్విఫ్ట్.. రూ.10 లక్షల లోపు ఫన్-టు-డ్రైవ్ హ్యాచ్‌బ్యాక్ కావాలనుకునే వారికి, మారుతి సుజుకి స్విఫ్ట్ ఒక అద్భుతమైన ఎంపిక. కొనుగోలుదారులు రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.35,000 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లు కూడా ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్‌ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ లభిస్తుంది.

మారుతి సుజుకి డిజైర్.. పెప్పీ మారుతి సుజుకి డిజైర్ ప్రస్తుతం రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. అయినప్పటికీ బ్రాండ్ ఈ మోడల్‌పై ఎటువంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు పరిమితం. అదేవిదంగా మారుతి సుజుకి సెలెరియో రేంజ్‌ రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్‌, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది. అయితే AMT వేరియంట్‌లు క్యాష్‌ డిస్కౌంట్‌ను పొందవని గమనించాలి. సెలెరియో CNG ఆప్షన్‌లను కూడా అందిస్తుంది, 25.24 kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్… పాపులర్‌ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. కొనుగోలుదారులకు రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్‌ ఇస్తోంది. వ్యాగన్‌ఆర్‌ 1.0L లేదా 1.2L పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ CNG వేరియంట్‌లో కూడా వస్తుంది. అలాగే మారుతి సుజుకి ఈకోపై డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి ఈకో మినీవ్యాన్‌పై ఆటోమేకర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను ప్రకటించింది. వీటిలో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూ.15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 ఉన్నాయి. ఈ ఆఫర్‌లు CNG, పెట్రోల్ వేరియంట్‌లకు వర్తిస్తాయి. ఫ్యామిలీస్‌, బిజినెస్‌లకు ఈకో అద్భుతమైన ఆప్షన్‌. ఇకపోతే మారుతి సుజుకి ఆల్టో కే 10 కొనుగోలుదారులు కూడా రూ.54,000 వరకు సేవ్‌ చేసుకోవచ్చు. బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్‌ బెనిఫిట్‌ అందిస్తోంది. సెలక్టెడ్‌ వేరియంట్‌లు రూ.4,000 కార్పొరేట్ బోనస్‌ను పొందవచ్చు.