Maruti Suzuki: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా సెప్టెంబర్ నెలలో నెక్సా లైనప్‌లోని కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వీటిలో బాలెనో, ఇగ్నిస్, సియాజ్ వంటి కార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఫోర్డ్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లపై ఎటువంటి తగ్గింపు లేదు. ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో చూద్దాం.
మారుతీ సుజుకి ఇగ్నిస్
ఈ నెల మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ గేర్‌బాక్స్ అమర్చిన మోడల్‌పై రూ.65,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, దాని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌పై రూ.55,000 తగ్గింపు లభిస్తోంది. Nexa లైనప్‌లో ఇదే చౌకైన ఉత్పత్తి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.84 లక్షల నుండి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.
Also Read: Jagan London Trip : జగన్ లండన్ టూర్ ఖర్చు ఎంతో..? ఆ డబ్బుతో ఎంతమందికి మేలు జరిగేదో తెలుసా..?
మారుతీ సుజుకి బాలెనో
ఈ నెల మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్, CNG వేరియంట్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా మొత్తం రూ. 35,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. సెప్టెంబరు 2 నుండి 19వ తేదీ మధ్య బుక్ చేసుకుంటే రూ. 5,000 ప్రత్యేక పండుగ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి బాలెనో 90hp పవర్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. CNG పవర్డ్ బాలెనో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
మారుతీ సుజుకి సియాజ్
మారుతి సుజుకి సియాజ్ అన్ని వేరియంట్లు ఈ నెలలో రూ. 48,000 వరకు తగ్గింపును పొందుతున్నాయి. ఇది గత నెలలో ఇచ్చిన తగ్గింపుతో సమానంగా ఉంటుంది. ఈ మధ్యతరహా సెడాన్ మార్కెట్లో ఉన్న స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి కార్లతో పోటీపడుతుంది. మారుతి సుజుకి సియాజ్ 105hp పవర్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.