Site icon HashtagU Telugu

Maruti Suzuki Brezza: 2023లో భారత్ లో ఎక్కువగా అమ్ముడైన కార్ ఏదో మీకు తెలుసా?

Mixcollage 03 Jan 2024 03 09 Pm 7242

Mixcollage 03 Jan 2024 03 09 Pm 7242

ఇటీవలె 2023 ముగిసిన విషయం తెలిసిందే. ఈ 2023 లో భారతదేశంలోనే ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాప్ లో నిలిచింది మారుతి. కాగా దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి బ్రెజ్జా క్యాలెండర్ ఇయర్ 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ మహీంద్రా స్కార్పియో వంటి మోడల్ కార్లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఇండియా, సీవై23లో 170,600 యూనిట్ల బ్రెజ్జా మోడళ్లను విక్రయించింది. కాగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా మారుతి ప్రొడక్టు కావడమే విశేషం. 203,500 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్ ముందంజలో నిలిచింది.

ఆ తర్వాత బ్రెజ్జా ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షలతో నిలిచింది. ఇకపోతే జనవరి 2024లో మొత్తం ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోలో మారుతి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో మారుతి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతి బ్రెజ్జా 5-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లతో కె15సి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగిస్తుంది. 5-స్పీడ్ ఎంటీతో కూడిన సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో కార్‌మేకర్ న్యూమెరో యునో స్థానంపై దృష్టి సారించిది.

ఎస్‌యూవీ మార్కెట్లో మారుతికి బ్రెజ్జా వాల్యూమ్ డ్రైవర్, బ్రెజ్జా కాకుండా, కార్ల తయారీ సంస్థ ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలను కూడా విక్రయిస్తుంది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కింద టెస్టింగ్ కోసం మారుతి అందించే మూడు మోడళ్లలో బ్రెజ్జా కూడా ఒకటిగా ఉంది. మిగిలిన రెండు మోడళ్లలో బాలెనో, గ్రాండ్ విటారా ఉన్నాయి.