Alto Mileage: మారుతీ సుజుకి నుంచి సరికొత్త మోడల్.. ఆల్టో కే10 సీఎన్జీ ఫీచార్లు ఇవే!

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇప్పటికే ఎన్నో రకాల కార్లను అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 09:45 AM IST

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇప్పటికే ఎన్నో రకాల కార్లను అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది మారుతి సుజుకి. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్లోకి మారుతి సుజుకి కంపెనీ ఆల్టో కె10 కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కాగా మార్కెట్ లో ఈ ఆల్టో కె10 యొక్క ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుండి ప్రారంభం కానుంది. మారుతి సుజుకి కొత్త ఆల్టో కె10 సిఎన్‌జి మోడల్‌ కూడా వస్తోంది. కాగా సెలెరియో తో కూడిన 1.0-L K10C ఇంజన్ రాబోయే సిఎన్‌జి మోడల్‌ లో చూడవచ్చు.

ఈ కొత్త ఆల్టో కె10 సిఎన్‌జి కారు కిలో మీటర్ కీ 35కిమీ మైలేజీని ఇవ్వగలదట. ఒక వేళ అదే కనుక నిజం అయితే రాబోయే CNG కారు భారతదేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన CNG హ్యాచ్‌ బ్యాక్‌లలో ఒకటి కానుంది. ఈ ఆల్టో కె 10 పెట్రోల్ వేరియంట్ 24.39kmpl మైలేజీని ARAI ధృవీకరించింది.అలాగే మరోక వైపు రాబోయే ఆల్టో కె 10 CNG కారు మైలేజ్ 35కీమీ /కేజీ గా ఉంటుంది. కాగా ఆటో వెబ్‌ సైట్ ప్రకారం కొత్త ఆల్టో కె10 సిఎన్‌జి ధర ప్రస్తుత ఆల్టో కె10 మోడల్ కంటే లక్ష రూపాయలకు పైగా ఉండవచ్చని సమాచారం. కాగా మారుతి సుజుకీ కంపెనీ ప్రస్తుతం తన లైనప్‌ ని పెంచుకోవాలని భావిస్తోంది.

అంతేకాకుండా రాబోయే కొద్ది నెలల్లో కంపెనీ కొత్త బ్రెజ్జా, బాలెనో సిఎన్‌జి మోడల్‌లను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆల్టో కె 10 సిఎన్‌జి మోడల్‌ను ప్రారంభించడంతో మారుతి సుజుకి సిఎన్‌జి పోర్ట్‌ఫోలియో చాలా బలంగా మారుతుంది. ఇకపోతే ప్రస్తుతం మారుతి సుజుకి Celerio సిఎన్‌జి, Wagon ఆర్ సిఎన్‌జి, ఆల్టో 800 సిఎన్‌జి, ఎస్ Presso సిఎన్‌జి, స్విఫ్ట్ సిఎన్‌జి, Dzire సిఎన్‌జి, Eco సిఎన్‌జి మరియు Ertinga వంటి సిఎన్‌జి మోడళ్లను అందిస్తోంది. అలాగే ఆల్టో కె10 సిఎన్‌జి భారతదేశంలో విడుదలైతే అది టాటా టియాగో సిఎన్‌జి తో నేరుగా పోటీపడబోతోంది. ఇక అదే సమయంలో రాబోయే సిఎన్‌జి కారు ఎస్ -Presso సిఎన్‌జి, Wagon ఆర్ సిఎన్‌జి, సెలెరియో సిఎన్‌జి వంటి మారుతి సుజుకి ఇతర ఖరీదైన సిఎన్‌జి కార్లతో పోటీపడునుంది.