Motorcycle: సూపర్ గురూ.. బీరుతో నడిచే బైక్.. మైలేజ్ ధర వివరాలు ఇవే?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో నిత్యం మార్కెట్లోకి రకరకాల వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. కాగా మొన్నటి వరకు ఇంధనంతో నడిచే వాహనాలు ఎక్కువగా

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 04:38 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో నిత్యం మార్కెట్లోకి రకరకాల వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. కాగా మొన్నటి వరకు ఇంధనంతో నడిచే వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఇంధన ధరలో ఆకాశాన్ని అంటుతుండడంతో ఎక్కువ శాతం మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ బైకులు స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్లు ఇలా రకరకాల వాహనాలు విడుదల అయ్యాయి.

అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకు డీజిల్ పెట్రోల్ తో నడిచే వాహనాలు లేదంటే ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ బీరుతో నడిచే వాహనం ఎప్పుడైనా మీరు చూశారా. అదేంటి బీరుతో నడిచే వాహనం ఏంటా అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. ఒక వ్యక్తి అమెరికన్ బీర్ తో నడిచే మోటార్ సైకిల్ ను రూపొందించాడు. అందుకు సంబంధించిన వీడియో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. కీ మైఖేల్సన్ అనే వ్యక్తి గతంలో రాకెట్‌పవర్డ్ టాయిలెట్ , జెట్‌పవర్డ్ కాఫీ పాట్ ను రూపొందించాడు. తన కొత్త ఆవిష్కరణలో గ్యాస్‌పవర్డ్ ఇంజిన్‌కు బదులుగా హీటింగ్ కాయిల్‌తో కూడిన 14గాలన్ కెగ్ ఉందని తెలిపాడు.

కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. ఇది బైక్‌ను ముందుకు నడిచేలా చేసే నాజిల్‌లో సూపర్‌ హీటెడ్ స్టీమ్‌గా మారుతుంది. కీ బ్లూమింగ్‌టన్‌లోని తన గ్యారేజీలో బీర్‌తో నడిచే మోటార్‌ సైకిల్‌ను సృష్టించాడు. ఆ వీడియోలో ఈ మోటార్‌ సైకిల్ గురించి మాట్లాడుతూ.. ఇది ఖచ్చితంగా భిన్నమైనది. నేను మరింత సృజనాత్మకంగా ఉండాలనుకుంటున్నాను. అసలే గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేను తాగను. నాకు తాగుడు అలవాటు లేదు. కాబట్టి మోటార్‌ సైకిల్‌ ఇంధనం కోసం ఆల్కహాల్‌ను ఉపయోగించడం తప్ప మరేమీ ఆలోచించలేనని ఆయన తెలిపారు. రాకెట్‌మ్యాన్ అని పిలువబడే కీ మైఖేల్సన్ ఇంకా బైక్‌ను రోడ్డుపైకి తీసుకెళ్లలేదు, అయితే బీర్‌తో నడిచే వాహనం కొన్ని స్థానిక కార్ షోలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మోటార్‌ సైకిల్ గరిష్టంగా గంటకు 240 కి.మీ వేగంతో దూసుకుపోతుందని తెలిపారు. ఆ వీడియోలో అతను బీరు పోసి బండి స్టార్ట్ చేసి మరి చూపించాడు. అయితే దీని ధర ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ బైక్ ని రోడ్డుపై నడపకుండా తన గ్యారేజ్ లోనే స్టార్ట్ చేయించి చూపించాడు.