Two-wheeler Care Tips: చలికాలంలో మనం జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వాహనాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు కార్ కేర్‌కి సంబంధించి అనేక చిట్కాలు, ఉపాయాల గురించి విని ఉంటారు. చాలా మంది వాటిని పాటించడం కూడా చూసి ఉంటారు. అయితే నాలుగు చక్రాల వాహనాలపై శ్రద్ధ వహించడమే కాకుండా, ద్విచక్ర వాహనాల (Two-Wheeler Care Tips)పై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని మీకు తెలుసా. ముఖ్యంగా చలికాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మేము మీకు కొన్ని చలికాలంలో బైక్‌ల కోసం తీసుకోవాల్సిన చిట్కాలు, ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మీరు మీ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
బ్యాటరీ స్కూటర్ లేదా బైక్‌ను జాగ్రత్తగా చూసుకోండి
– ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో వాహన బ్యాటరీని సుమారు 3 గంటల పాటు ఛార్జ్ చేయండి. ఈ సీజన్‌లో మీ వాహనం బ్యాటరీని డిశ్చార్జ్ చేయకుండా ప్రయత్నించండి. ఇలాంటి పరిస్థితిలో బ్యాటరీ జీవితం చెడిపోయే అవకాశం ఉంది.
– చలికాలంలో వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం మానుకోండి. నీడ ఉన్న ప్రదేశాలలో వాహనాన్ని పార్క్ చేయండి.
– శీతాకాలంలో మీ స్కూటర్, బైక్‌ను ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయండి. ఇలా చేస్తే మీ వాహనం జీవితకాలం పెరుగుతుంది. మీ వాహనం కూడా సురక్షితంగా ఉంటుంది.
Also Read: Iran Vs Pakistan : పాక్‌పైనా ఇరాన్ ఎటాక్.. మిస్సైల్స్, సూసైడ్ డ్రోన్స్‌తో ఉగ్ర స్థావరాలపై దాడి
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
– చలికాలంలో ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించే ముందు దానిని కొంతసేపు ఆన్ చేసి ఉండండి. ఇలా చేయటం వలన ఇంజన్ కాస్త వేడి అవుతుంది. దీంతో వాహనం బ్యాటరీపై తక్కువ ఒత్తిడి ఉంటుంది.
– ఎక్కువ కాలం పాటు లేదా దూర ప్రయాణాల్లో ద్విచక్ర వాహనంపై నిరంతరాయంగా ప్రయాణించడం మానుకోండి. లేదంటే వాహనం బ్యాటరీ పాడైపోతుంది.
– చల్లని వాతావరణంలో స్కూటర్‌ను అధిక వేగంతో నడపవద్దు. అలా నడిపితే బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీ కూడా పాడయ్యే అవకాశం ఉంది.
– ముఖ్యంగా డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా బండి నడపడం చట్టరీత్యా నేరం. జరిమానా కట్టాల్సి ఉంటుంది.
– అలాగే ఈ చలికాలంలో పొగమంచు వలన ఎదురుగా వచ్చే బండ్లు సరిగ్గా కనపడవు. అందువలన చాలా నెమ్మదిగా వెళ్లటం ఉత్తమం.