Site icon HashtagU Telugu

Electric Two-Wheelers: స్కూటర్, బైకుల బ్యాటరీలు పేలిపోవడానికి గల కారణాలు ఇవే?

Mixcollage 05 Jul 2024 06 00 Pm 1158

Mixcollage 05 Jul 2024 06 00 Pm 1158

ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు విషయంలో చేసుకుంటున్న సంఘటనలో కొంతమంది వినియోగదారులను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. అదే బ్యాటరీలు పేలిపోవడం. కారణాలు ఏదైనా ఈ మధ్యకాలంలో ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు పేలిపోవడంతో వినియోగదారులు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

మరి ఇంతకీ ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లలో మంటలు రావడానికి అత్యంత సాధారణ కారణాలలో షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్ట్ కూడా ఒకటి. బ్యాటరీ కనెక్షన్లు సరైన విధంగా లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. ఈ వాహనాల్లో తరచుగా ఏడు కిలోవాట్ల వరకు కెపాసిటీ ఉన్న ఛార్జర్లను ఉపయోగిస్తారు. కనెక్షన్లు వదులుగా లేదా సరిగ్గా నిర్వహించకపోతే షార్ట్ సర్క్యూట్ లు జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భారత్ లో ఎండ వేడి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

ఇక్కడ ఎండ వేడి ద్విచక్ర వాహనాల పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, బ్యాటరీ వేడెక్కుతుంది. అలాగే తప్పు ఛార్జర్లను ఉపయోగించడం వల్ల కూడా బ్యాటరీలు పేలే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం నిర్దిష్ట రకం బ్యాటరీ, అనుకూల ఛార్జర్తో రూపొంది ఉంటుంది. వేరొక మోడల్ లేదా బ్యాటరీ రకానికి ఉద్దేశించిన ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల విద్యుత్ పరిమితులు సరిపోక అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహనాలు ఉపయోగంలో ఉన్నప్పుడు బ్యాటరీలు ఎక్కువ స్థాయిలో వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ వేడిని నిర్వహించడానికి బ్యాటరీ కవర్లు హీట్ సింక్లు చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తూ, కొంతమంది తయారీదారులు బ్యాటరీ, మొత్తం బరువును తగ్గించడానికి ఈ భాగాలను పెద్దగా పట్టించుకోరు.

దాంతో రవాణా చేయడం సులభం అవుతుంది. అయితే ఇది సరిగ్గా చల్లబడకపోతే అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా లిథియం బ్యాటరీలు, కొన్నిసార్లు గ్యాసోలిన్ తో పనిచేస్తాయి. గ్యాసోలిన్ 210 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉంటే మండుతుంది. లిథియం బ్యాటరీలు 135 డిగ్రీల సెల్సియస్ వద్దే మంటలు అంటుకుంటాయి. దీనిని నివారించడానికి, ఎండాకాలంలో ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లను నీడ లేదా చల్లని ప్రదేశాలలో పార్క్ చేయడం మంచిది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.