Mahindra Xuv700 Price: గుడ్ న్యూస్ మహీంద్రా.. ఆ SUV కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్?

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తాజాగా వినియోగదారులకు,కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ ని తెలిపింది. SUV కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్ ని అందిస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 700, ఎక్స్‌యూవీ7

Published By: HashtagU Telugu Desk
Mixcollage 10 Jul 2024 03 55 Pm 7891

Mixcollage 10 Jul 2024 03 55 Pm 7891

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తాజాగా వినియోగదారులకు,కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ ని తెలిపింది. SUV కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్ ని అందిస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 700, ఎక్స్‌యూవీ700 AX7 వేరియంట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వేరియంట్‌ పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఈ వేరియంట్ ప్రారంభ అసలు ధర రూ.21 లక్షలు కాగా జూలై 9వ తేది నుంచి రూ. 19.49 లక్షల నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అంటే ఈ కారుపై ఏకంగా మూడు లక్షల వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు. కాగా ఎక్స్‌యూవీ700 కారుకు మార్కెట్‌ లో ఉన్న డిమాండ్‌ ను దృష్టలో పెట్టుకుని, తమ వినియోగదారుల కోసం ధరను తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కొత్త ధరలు మహీంద్రా కంపెనీ వార్షికోత్సవం వరకు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. అంటే ఈ తగ్గిన ధరలు దాదాపు నాలుగు నెలల పాటు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తగ్గిన ధరలు ఇటీవలే విడుదలైనా ఎక్స్‌యూవీ700 లో డీప్ ఫారెస్ట్‌తో పాటు బర్న్ట్ సియెన్నా అనే రెండు కలర్ ఆప్షన్స్‌ పై మాత్రమే అందుబాటులో ఉంచిన్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ ఎక్స్‌యూవీ మొత్తం 9 కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఇకపోతే మహీంద్రా XUV700 ధరల విషయానికి వస్తే.. తాజాగా మహేంద్ర ప్రకటించిన ఈ కొత్త ధరలు దాదాపు నాలుగు నెలల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత కంపెనీపై ధరలు అధారపడి ఉండే ఛాన్స్‌ లు ఉంటాయట. ఇక ఈ కార్ల ధర వివరాల్లోకి వెళితే.. సిక్స్‌ సీటర్‌ XUV700 AX7 MT పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.19.69 లక్షల కంటే అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఇక ఇందులోనే డిజిల్‌ వేరియంట్‌ రూ.20.19 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ ధర 21.19 లక్షలు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఇందులో డీజిల్‌ వేరియంట్ కేవలం రూ.21.59 లక్షల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ధర జూలై 09వ తేది నుంచి అన్ని మహీంద్రా షోరూమ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సేల్స్ లు కూడా మొదలయ్యాయి.

 

  Last Updated: 10 Jul 2024, 03:56 PM IST