ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మహీంద్రా సంస్థ ఎన్నో రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాహనాలపై భారీగా ధరలను పెంచేస్తోంది. అందులో భాగంగానే ఎక్స్‌యూవీ700 కారు ధరలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు, కస్టమర్లు ఎవరైనా వడ్డీ ద్వారా ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందట.
ఈ కొత్త ధరలు డీజిల్, పెట్రోల్ వెర్షన్‌లలో హాట్ సెల్లింగ్ ట్రిమ్ మోడల్స్‌కు వర్తిస్తాయి. ఈ జాబితాలో ఎఎక్స్7 ఎఎక్స్7ఎల్, ఎఎక్స్7ఎల్ 7ఎస్ డీజిల్ ఎటీ అలాగే ఎఎక్స్7ఎల్ 6ఎస్ డీజిల్ ఎటీ, ఎఎక్స్7ఎల్ ఎడబ్ల్యూడీ 7ఎస్ డీజిల్ ఎటీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ ఈ మోడల్స్ పై 30000 నుంచి 50 వేల వరకు ధరను పెంచేసాయి. మహీంద్రా కారు మోడల్ మధ్య 6, 7-సీటింగ్ కాన్ఫిగరేషన్ లలో ఎఎక్స్7 ఎంటీ వేరియంట్ల ధర ట్యాగ్ లు అలాగే ఉంటాయి. ఎఎక్స్7 మోడల్ 7 సీటర్ పెట్రోల్ ఎటీ కూడా ఎలాంటి ధరల పెంపును కలిగి ఉండదు. కాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 సెగ్మెంట్ లోని అతిపెద్ద ఎస్‌యూవీ లలో ఒకటిగా వస్తుంది.
రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ రెండింటి లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మొదటిది గరిష్టంగా 197బీహెచ్‌పీ, 380ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండోది గరిష్టంగా 182 బీహెచ్‌పీ 450ఎన్ఎమ్ అవుట్‌పుట్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు యూనిట్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో వస్తాయి. ఇప్పటికే ధరలు మండిపోతున్నాయని వినియోగదారులు తలలు పట్టుకుంటుండగా తాజాగా మరోసారి ధరలను పెంచుతూ మళ్లీ షాక్ ఇచ్చింది మహీంద్రా.