Electric Car: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

ఈ మధ్యకాలంలో వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. వీటినే వినియోగించడానికి

Published By: HashtagU Telugu Desk
Mahendra

Mahendra

ఈ మధ్యకాలంలో వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. వీటినే వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు కూడా అందుకు అనుగుణంగానే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కాగా ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా దూసుకెల్లడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగదారుల అభివృద్ధిలో మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తూ దూసుకుపోవాలని చూస్తోంది.

ఇక అందులో భాగంగానే మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీ మోడల్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది. అంతేకాకుండా తమ తొలి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం ఎక్స్‌యూవీ 400 ను వచ్చే ఏడాది అనగా 2023 జనవరి లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది 2022 డిసెంబర్‌లో టెస్ట్‌ డ్రైవ్‌లు, 2023 జనవరిలో తొలి వారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని కంపెనీ ఈడీ రాజేష్‌ జెజూరికర్‌ ప్రకటించారు.

ఇకపోతే గతంలో కూడా మహీంద్రా తన ఎక్స్‌యువి700 ఎస్‌యూ‌వి కారు బుకింగ్స్ ను తెరిచిన కేవలం గంట లోపే 25,000 మంది బుకింగ్ చేసి ఒక రికార్డ్‌ ను క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సారి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్‌లో పాత రికార్డ్‌ బ్రేక్‌ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా కూడా ఈ కారుపై హైప్‌ క్రియేట్‌ చేసేందకు సె​ప్టంబర్‌ 8 సాయంత్రం 7.30 ఎక్స్‌యూవీ 400 కారు లుక్‌కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది.

  Last Updated: 09 Sep 2022, 04:16 PM IST