Mahindra XUV 3X0: ఈ కారుకు చాలా డిమాండ్ గురు.. డబ్బు కట్టినా కూడా ఏకంగా ఆరు నెలలు ఆగాల్సిందేనట.!

మహీంద్రా కి చెందిన ఈ కారుని కొనుగోలు చేయాలంటే కొన్ని నెలల పాటు ఆడాల్సిందేనట.

Published By: HashtagU Telugu Desk
Mahindra XUV400

Mahindra XUV400

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవల భారత మార్కెట్లోకి ఒక కొత్త కారును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్య విడుదల అయినా ఈ కారు ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. మహీంద్ర ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్ర ఎక్స్‌యూవీ300 కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ మోడల్‌ కార్లు నెలకు సగటును ఏకంగా 9000 నుంచి 10000 వరకు అమ్ముడు పోతున్నాయి.

అయితే అంతకు ముందు 4 వేలుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 10 వేలకు పెరగడం విశేషం అని చెప్పాలి. దీంతో ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి. చేతినిండా డబ్బులు ఉన్నా, ఫుల్ డౌన్‌పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు. ఎందుకంటె ఈ కార్లను ముందుగా ఆర్డర్‌ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్‌ వేచి చూడాల్సిందే. అన్ని ఉన్న కూడా ఈ కారును సొంతం చేసుకోవాలంటే ఎదురు చూడక తప్పదు మరి.

ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌పై గరిష్టంగా ఏకంగా ఆరు నెలల ఆగాల్సిందే. దీనిని బట్టి ఈ కార్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఆరు నెలల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ ని కలిగి ఉంది. కాగా ఇతర వేరియంట్స్‌ కు రెండు నెలల సమయం పడుతుంది. మిడ్ స్పెక్ AX5 ట్రిమ్ కావాలంటె నాలుగు నెలల పాటు వెయిట్ చేయక తప్పదు. కాగా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ ను ఇచ్చారు. లెవెల్ 2 ADAS టెక్నాలజీ, పనోరమిక్ సన్‌ రూఫ్‌ ని కూడా అందించారు.

1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్స్‌ లో ఈ కారును తీసుకొచ్చారు. ఇక పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటో మేటిక్ గేర్‌బాక్స్‌ తో తీసుకొచ్చారు. అయితే డీజిల్‌ ఇంజన్‌ మాన్యువల్‌, 6 స్పీడ్ AMT వేరియంట్స్‌ లో తీసుకొచ్చారు. ఇకపోతే ఈ కారు ధర విషయానికొస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంది.

  Last Updated: 17 Sep 2024, 11:07 AM IST