NCAP Safety Ratings : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్.. దీన్నే సంక్షిప్తంగా ‘భారత్ ఎన్‌క్యాప్’ అని పిలుస్తాం. కార్లు, ఎస్‌యూవీలు, ఎక్స్‌యూవీలలో పెద్దవాళ్లు, పిల్లలకు ఎంతమేర సేఫ్టీ లభిస్తుంది ? అవి రోడ్డు ప్రమాదాలను ఎంతమేర తట్టుకోగలవు ? అనే దానికి సంబంధించిన రేటింగును ‘భారత్ ఎన్‌క్యాప్’ ద్వారా అందిస్తుంటారు. ఇందులో భాగంగా వాహనాలకు క్రాష్ టెస్టును నిర్వహిస్తారు. అందులో వచ్చే ఫలితంగా ఆధారంగా రేటింగును కేటాయిస్తారు. గరిష్ఠంగా 5 స్టార్ రేటింగ్‌ను పొందే వాహనం బలంగా, ప్రమాద దుర్భేధ్యంగా ఉన్నట్టు అర్థం.
Also Read :Jio Data Booster : జియో గుడ్ న్యూస్.. రూ.11కే 10 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్
మహీంద్రా కంపెనీ వెహికల్స్ మరోసారి సత్తా చాటుకున్నాయి. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో మహీంద్రాకు చెందిన మూడు వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. ఎక్స్‌యూవీ అంటే.. క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మహీంద్రా కంపెనీ తీసుకొచ్చిన ‘ఎక్స్‌యూవీ 400’కు ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ రేటింగ్ పొందిన మహీంద్రా కంపెనీ తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం. మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 400’(NCAP Safety Ratings) పెద్దల సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకుగానూ 30.38 పాయింట్లు పొందింది. చిన్నారుల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 43 సాధించింది.
Also Read :Tulsi Gabbard : అమెరికా ఇంటెలీజెన్స్ చీఫ్‌గా తులసి.. ఆమె ఎవరు ?
మహీంద్రాకు చెందిన ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ’ వాహనంలోని పెద్దలు, చిన్నారుల సేఫ్టీకి సంబంధించి 5 స్టార్ రేటింగును సాధించింది. మహీంద్రాకు థార్ రాక్స్ పెద్దల భద్రతకు సంబంధించి 31.09 పాయింట్లు సాధించింది. చిన్నారుల భద్రత విషయంలో అది 45 పాయింట్లు పొందింది. పెద్దలు, పిల్లల సేఫ్టీ విషయంలో దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ దక్కింది. టాటామోటార్స్ కంపెనీ కార్లు, అన్ని రకాల వాహనాలకు క్వాలిటీకి పెట్టింది పేరు. వీటి బాడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. టాటా నెక్సాన్, టాటా కర్వ్ కార్లకు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ లభించింది.