Mahindra Thar: మీరు మహీంద్రా థార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. కంపెనీ 2026లో రెండోసారి ఈ పాపులర్ ఆఫ్-రోడ్ SUV ధరలను పెంచింది. ఈసారి కొన్ని వేరియంట్ల ధర ఏకంగా 43,500 రూపాయల వరకు పెరిగింది. అయితే బేస్ మోడల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
రెండుసార్లు పెరిగిన ధరలు
మహీంద్రా జనవరి 2026లో మొదటిసారి థార్ ధరలను పెంచగా, ఇప్పుడు ఏప్రిల్ 2026లో రెండోసారి ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు 30,500 రూపాయల నుండి 43,500 రూపాయల మధ్య ఉంది.
బేస్ వేరియంట్ ధరలో మార్పు లేదు
థార్ బేస్ వేరియంట్ AXT 1.5L Diesel RWD ధర ఇప్పటికీ 9.99 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్)గానే ఉంది. వరుసగా రెండుసార్లు ధరలు పెరిగినప్పటికీ ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరను కంపెనీ మార్చకపోవడం విశేషం.
Also Read: Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!
ఏ వేరియంట్లపై ధర పెరిగింది?
ఈసారి ధరల పెంపు కేవలం LXT వేరియంట్లలో మాత్రమే జరిగింది. AXT వేరియంట్ల ధరలు పాతవే కొనసాగుతున్నాయి. ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ ఆధారంగా LXT వేరియంట్లలో ఈ పెరుగుదల ఉంది.
కనిష్ట- గరిష్ట పెరుగుదల
అతి తక్కువ పెంపు: LXT 1.5L Diesel RWD MT, LXT 2.0L Petrol RWD AT వేరియంట్లపై 30,500 రూపాయలు పెరిగింది.
అతి ఎక్కువ పెంపు: LXT 2.2L Diesel 4WD AT వేరియంట్‌పై గరిష్టంగా 43,500 రూపాయలు పెంచారు.
మాన్యువల్ వేరియంట్ల కొత్త ధరలు
మాన్యువల్ వేరియంట్లలో LXT 2.0L Petrol 4WD MT ధర 37,500 రూపాయలు పెరిగి ఇప్పుడు 15.26 లక్షల రూపాయలకు చేరుకుంది. అలాగే LXT 2.2L Diesel 4WD MT ధర 39,500 రూపాయలు పెరిగి 16.08 లక్షల రూపాయలుగా మారింది.
ఆటోమేటిక్ వేరియంట్ల ధరల్లో మార్పు
ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. LXT 2.0L Petrol 4WD AT ధర 41,500 రూపాయలు పెరిగి 16.86 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇక అత్యధికంగా ధర పెరిగిన వేరియంట్ LXT 2.2L Diesel 4WD AT ఇప్పుడు 17.62 లక్షల రూపాయలకు లభిస్తుంది.
