మెట్లుఎక్కి నెటిజెన్స్ ని ఆశ్చర్యపరిచిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వీడియో వైరల్?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల ఇంధనకారులు ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన విషయం తెలిసిందే. అయితే మామూలుగా మనం క

Published By: HashtagU Telugu Desk
Mahindra Scorpio

Mahindra Scorpio

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల ఇంధనకారులు ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన విషయం తెలిసిందే. అయితే మామూలుగా మనం కార్లు ఎత్తు ప్రదేశాల నుంచి తగ్గు ప్రదేశాలకు రావడం అన్నది చూసి ఉంటాము. ముఖ్యంగా కారు మెట్ల పైనుంచి కిందికి దిగడం అన్నది చాలా అరుదుగా మాత్రమే చూసి ఉంటాం. ఇక కారు మెట్లు ఎక్కడం అన్నది కేవలం సినిమాలలో మాత్రమే చాలా వరకు చూసి ఉంటారు. హీరో విలన్లు ఇలా కార్లు మెట్లు ఎక్కించిన సన్నివేశాలు ఎక్కువగా మనకు సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి.

కానీ అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ఆ వీడియోని చూసిన వాహన ప్రేమికులు ఆకారపై మనసు పారేసుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎన్ మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూట్యూబ్​లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ ఎంతో సులభంగా మెట్లు ఎక్కడం చూడవచ్చు. అంతేకాకూండా ఈ వైట్ కలర్ స్కార్పియో సులభంగా మెట్లు దిగటం కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీ తప్పకుండా అర్థమవుతుంది.

కార్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ ప్రాంతం మొత్తమ్ నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి. ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది కొనుగోలుదారులను ఎంతగా ఆకర్షించిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది.

  Last Updated: 04 Jun 2023, 05:56 PM IST