Site icon HashtagU Telugu

XUV 400 Pro: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. లుక్, ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 12 Jan 2024 03 26 Pm 3841

Mixcollage 12 Jan 2024 03 26 Pm 3841

భారత్ లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ పెరుగుతూనే ఉంది. దానికి తోడు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా అప్‌డేట్ చేసిన XUV 400 ప్రో ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ కొత్త కారులో 3 రకాల వేరియంట్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.15.49 లక్షల నుంచి మొదలవుతుంది. XUV 400 EC వేరియంట్‌లో 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇచ్చారు.

దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.15.49 లక్షలుగా ఉంది. XUV 400 EC ప్రోలో 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. దీని ధర రూ.16.47 లక్షలు ఉంది. ఇంకా XUV 400 EL ప్రోలో 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.17.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జనవరి 12 నుంచి రూ.21వేలతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మే 31 తర్వాత నుంచి ఈ కారు ధరను మరింత పెంచునున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్లలో 34.5kWh బ్యాటరీ ఉన్న కారును ఒకసారి ఛార్జ్ చేస్తే, 375 కిలోమీటర్లు వెళ్తుందనీ, అదే 39.4kWh బ్యాటరీ ఉన్న కారును ఒకసారి ఛార్జ్ చేస్తే, 456 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ తెలిపింది. ఈ కార్లలో కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

టాప్ EL ప్రో వేరియంట్‌.. Alexaతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆపిల్ కార్ ప్లే /ఆండ్రాయిడ్ ఆటో, AdrenoX-కనెక్ట్ చేసిన కార్ టెక్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, రియర్ టైప్-సి USB పోర్ట్, రియర్ మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, AdrenoX కనెక్ట్ చేసిన కార్ టెక్ వంటివి ఉన్నాయి. లోపల ఇంకా XUV 400 ప్రో శాటిన్ కాపర్ యాక్సెంట్‌లతో గ్రే, బ్లాక్ అప్హోల్స్టరీతో రీ-డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్‌ను కలిగివుంది. ఈవీ ఇప్పుడు కాపర్ స్టిచింగ్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను కలిగివుంది.

మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, TPMS, వెనుక కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVMలు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో వైపర్లు ఉన్నాయి. భద్రత పరంగా చూసుకుంటే ఈవీ కి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని-నాలుగు డిస్క్ బ్రేక్‌లు, ISOFIX మౌంట్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ESP మరిన్ని ఉన్నాయి. ఈవీ మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగివుంది. ఫన్, ఫాస్ట్, ఫ్యూరియస్. ఇది సింగిల్-పెడల్ డ్రైవ్ టెక్నాలజీ కోసం L- మోడ్‌ను కూడా కలిగివుంది.

Exit mobile version