Site icon HashtagU Telugu

Scorpio Without Airbags: ఎయిర్‌బ్యాగ్స్ వివాదంపై మహేంద్ర క్లారిటీ

Scorpio Without Airbags

Scorpio Without Airbags

Scorpio Without Airbags: మహీంద్రా కార్లకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. సంస్థ అధినేత ఆనంద్ మహేంద్ర నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక సమస్యపై స్పందిస్తూనే ఉంటాడు. గతేడాది జరిగిన కారు ప్రమాదం కారణంగా మహేంద్ర ఆనంద్ పై కేసు నమోదైంది. కారు భద్రతపై తప్పుడు హామీలు ఇచ్చారంటూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఎయిర్‌బ్యాగ్‌లు లేని స్కార్పియో కారును విక్రయించిందని ఓ కుటుంబ ఆరోపించింది.

గతేడాది జనవరి 14న జరిగిన మహేంద్ర సంస్థకు చెందిన స్కార్పియో కారులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు మృతి చెందాడు. బాధితుడు లక్నో నుంచి కాన్పూర్‌కు వెళ్తుండగా పొగమంచు కారణంగా డివైడర్‌ను ఢీకొని ఎస్‌యూవీ బోల్తా పడింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీటు బెల్ట్ ధరించినప్పటికీ ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుకు ఓపెన్ కాలేదో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు మహీంద్రా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించారు. అయితే అక్కడ సిబ్బంది ఇచ్చిన సమాధానాలపై అనుమానం వ్యక్తం చేస్తూ.. బాధితుడి తండ్రి రాజేష్ మిశ్రా మహీంద్రా మరియు 12 మందిపై కేసు పెట్టాడు. కాగా ప్రమాదానికి గురైన కారు విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు

కాన్పూర్ ప్రమాదంలో స్కార్పియో ఎస్‌యూవీలోని ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుకు పనిచేయలేదో తెలుసుకోవడానికి గత ఏడాది అక్టోబర్‌లో కార్ల తయారీ సంస్థ వివరణాత్మక దర్యాప్తును నిర్వహించిందని మహీంద్రా తెలిపింది. స్కార్పియో SUVలో ఎయిర్‌బ్యాగ్‌లు లేవనే ఆరోపణలను ఖండించింది. స్కార్పియో ఎస్‌యూవీ క్రాష్ అయిన కోణం కారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చలేకపోయాయని కార్ల తయారీదారు తెలిపారు. స్కార్పియో SUV 2020లో కొనుగోలు చేశారు. 2020లో తయారు చేసిన స్కార్పియో S9 వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో ఎయిర్‌బ్యాగ్‌లో ఎటువంటి లోపం లేదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. అయితే తమ సంస్థకు సంబందించిన కారులో వ్యక్తి మరణించడంతో మహేంద్ర సంస్థ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

Also Read: Save Democracy – Save AP : ‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్” – నారా భువనేశ్వరి