Mahindra: మార్కెట్ లోకి విడుదల అయినా సరికొత్త మహీంద్రా ట్రక్కు.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో కారు అంటే చాలామంది వామ్మో అనేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మా

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 03:30 PM IST

ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో కారు అంటే చాలామంది వామ్మో అనేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ప్రతి పదిమందిలో ఎనిమిది మంది కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లు అధునాతన ఫీచర్లతో అనేక రకాల కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అయినా మహీంద్రా ఇప్పటికీ ఎన్నో రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇందన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నో రకాల వాహనాలను విడుదల చేసిన మహీంద్రా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మార్కెట్ లోకి మహీంద్రా సరికొత్త ట్రక్కును తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ట్రక్కులను ఆవిష్కరించింది. సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సెల్‌ ను డీజిల్‌, సీఎన్‌జీ డ్యుయో వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఇకపోతే దీని ధర విషయానికి వస్తే.. రూ.6.61నుంచి 6.93 లక్షల మధ్య ఉన్నాయి. చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ వృద్ధి కొనసాగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. పరిశ్రమ 5-10 శాతం మేర వృద్ధి చెందొచ్చని, అంత కంటే మెరుగ్గా తాము రాణిస్తామని మహీంద్రా ఆటో వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌ బనేశ్వర్‌ బెనర్జీ పేర్కొన్నారు. రాబోయే నెలల్లో పిక్‌-అప్‌ శ్రేణిలో ఎయిర్‌ కండిషనింగ్‌ మోడళ్లు తీసుకు రావాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. 2 టన్నుల్లోపు విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 22 శాతం క్షీణతను నమోదు చేయనుండగా.. మహీంద్రా మాత్రం 22 శాతం వృద్ధిని నమోదు చేయనుందని ఆయన అన్నారు.