Luxury Car Sales : ఒకప్పుడు మన దేశంలో కార్ల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది దేశ ప్రజలు లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్‌కు ఎదిగారు. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లు చాలామంది రిచెస్ట్ పర్సన్లుగా మారారు. ఈ పరిణామాలతో కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. తాజాగా గత ఏడాది వ్యవధిలో సూపర్ లగ్జరీ కార్ల సేల్స్ (Luxury Car Sales) సైతం బాగానే జరిగాయి.
We’re now on WhatsApp. Click to Join
సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి. 2023 సంవత్సరంలో 1,000 యూనిట్ల లగ్జరీ కార్ల సేల్స్ జరిగాయి. రాబోయే ఏడాదిలో లగ్జరీ కార్ల సేల్స్ 1300కు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. లంబోర్ఘిని లగ్జరీ కారులోని హురాకాన్, ఉరుస్, రెవెల్టో మోడల్స్ మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.
Also Read :Doctors Safety : దేశంలో వైద్య సిబ్బంది భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
లంబోర్ఘిని కార్లకు మన దేశంలో డిమాండ్ బాగా పెరిగింది. చాలామంది ఆర్డర్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా లంబోర్ఘిని కారును బుక్ చేసుకుంటే 2026 సంవత్సరం తర్వాతే డెలివరీ చేస్తామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో మన దేశంలో 103 లంబోర్ఘిని కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఫెరారీ, మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్ కార్ల సేల్స్ సైతం బాగానే జరుగుతున్నాయి. మెర్సిడెజ్ బెంజ్, ఆడి కంపెనీలకు చెందిన హై ఎండ్ మోడల్‌ల కోసం బుకింగ్ చేసుకుంటే.. ఏడాది తర్వాత డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. వీటి ధరలు రూ. 2.5 కోట్ల నుంచి రూ.4.55 కోట్ల రేంజులో ఉంటాయి. ఇంత ధర చెల్లించేందుకు ఔత్సాహిక వాహన ప్రియులు రెడీ అవుతున్నా వెంటనే డెలివరీ మాత్రం దొరికే ఛాన్స్ లేకుండాపోయింది. ఆర్డర్లు భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.