Site icon HashtagU Telugu

Lectrix EV: మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో అన్ని కి.మీ మైలేజ్!

Mixcollage 31 Jul 2024 12 04 Pm 1744

Mixcollage 31 Jul 2024 12 04 Pm 1744

ఇటీవల కాలంలో మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్కూటర్లు విడుదలైన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు నేడు మార్కెట్‌ లో బెస్ట్ స్కూటర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల అయింది. ఆ వివరాల్లోకి వెళితే.. లెక్ట్రిక్స్‌ ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ని ప్రవేశపెట్టింది.

కాగా లెక్ట్రిక్స్ ఈవీ అనేది SAR గ్రూప్‌కి చెందిన ఇ మొబిలిటీ విభాగం అన్న విషయం తెలిసిందే. భారత్ లో ఉన్న టాప్ 10 ఈవీ కంపెనీల్లో లెక్ట్రిక్స్ కూడా ఒకటి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కంపెనీ క్రమం తప్పకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా లెక్ట్రిక్స్‌ ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0 కి కొనసాగింపుగా లెక్ట్రిక్స్‌ 3.0 lxs ఈవీని ఆ సంస్థ విడుదల చేసింది. కాగా ఈ కొత్త మోడల్ లెక్ట్రిక్స్ ఈవీ3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాగా ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. రేపు అనగా ఆగస్టు 1 నుంచి డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న లెక్ట్రిక్స్ ఈవీ అవుట్‌లెట్స్‌ ద్వారా ఈ స్కూటర్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 1200 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 54 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 10.5 సెకండ్ లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అదేవిదంగా మెరుగైన వేగం స్మూత్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సాధించడానికి ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లను కూడా కలిగి ఉంది. కొత్త లెక్ట్రిక్స్ lxl 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో భారీ అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. భారతదేశంలోని అన్ని రకాల భూభాగాలకు అనువైన వాహనంగా దీనిని రూపొందించినట్లు తయారీ దారులు తెలిపారు. అయితే ఈ స్కూటర్ ధర, ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన కీలక వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను కంపెనీ త్వరలో తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది. అయితే ప్రస్తుతం ప్రస్తుతం lxs G2.0 హై స్పీడ్, lxs 2.0 హై-స్పీడ్, lxs సబ్‌స్క్రిప్షన్‌, lxs హై-స్పీడ్, sx 25 స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇటీవలె లెక్ట్రిక్స్ lxs 2.0 మోడల్‌ని ఆ కంపెనీ లాంచ్‌ చేసింది.

Exit mobile version