Site icon HashtagU Telugu

Lectrix EV LXS 2.0: మార్కెట్ లోకి వచ్చేసిన లెక్ట్రిక్స్ ఈవీ LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో అన్ని కి.మీ ప్రయాణం?

Lectrix Ev Lxs 2.0 E Scooter Launched With A Range Of 98 Km 1

Lectrix Ev Lxs 2.0 E Scooter Launched With A Range Of 98 Km 1

ప్రస్తుతం మార్కెట్లో ఈవీ వాహనాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ డిమాండ్‌కు తగినట్టుగానే వాహన తయారీ దారులకు కూడా కొత్త ఈవీ వాహనాలను మార్కెట్లోకి దించుతున్నారు. అందులో భాగంగానే భారత మార్కెట్లోకి పాపులర్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ లెక్ట్రిక్స్‌ ఈవీ స్టార్టప్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఈ లెక్ట్రిక్స్‌ కంపెనీ ప్రవేశపెట్టిన LXS 2.0 స్కూటర్ సరసమైన ధరలో హై రేంజ్‌ ఫీచర్లతో అందుబాటులో ఉంది. కాగా ఈ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈవీ స్కూటర్ ధర రూ. 79,999 గా ఉంది. లాంగ్ డ్రైవ్ చేసే వాహనదారులకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

లాంచ్ చేయడానికి ముందుగానే ఈ స్కూటర్ సామర్థంపై 1.25 లక్షల కిలో మీటర్ల వరకు టెస్ట్‌ రన్‌ నిర్వహించినట్టు కంపెనీ వెల్లడించింది. టెస్ట్‌ రన్‌ సక్సెస్ అయిందని, ఎలాంటి సమస్యలు లేవని లెక్ట్రిక్స్‌ ఈవీ స్పష్టం చేసింది. లెక్ట్రిక్స్‌ ఈవీ 2.0 స్కూటర్ 2.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. భారీ బ్యాటరీ కలిగిన ఈవీ స్కూటర్ ధర రూ. 79,999 కు ప్రవేశపెట్టింది. ఫుల్ ఛార్జింగ్‌పై 98 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కంపెనీ వెల్లడించింది. కొత్త లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3కిడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. చిన్న బ్యాటరీ సామర్థ్యం మినహా మోడల్ ఒకే మాదిరిగా ఉంటుంది. ఇ-స్కూటర్ 2.2కిలోవాట్ బీఎల్‌డీసీ హబ్ మోటార్‌ను పొందుతుంది.

గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది. ఇతర ఫీచర్లలో 25 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, 90/110 ఫ్రంట్, 110/90 బ్యాక్ 10-అంగుళాల టైర్లు, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే, ఈవీ స్కూటర్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. లెక్ట్రిక్స్‌ ఈవీ 2.0 కొనుగోలు చేసే వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక డెలివరీల విషయానికి వస్తే.. వచ్చే మార్చి 2024 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందరి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈవీ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.