Lava Blaze 5G: అతి తక్కువ ధరికే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా ఇప్పటికి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం

Published By: HashtagU Telugu Desk
Lava Blaze 5g

Lava Blaze 5g

ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా ఇప్పటికి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా లావా సంస్థ వారు అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చారు. ఆ5 జీ స్మార్ట్ ఫోన్ ధర 10 వేల తక్కువగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను కేంద్ర ఐటి ఎలక్ట్రానిక్ శాఖా మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించడం జరిగింది.

కాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ పదివేల లోపు గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కీ సంబంధించిన ఫ్రీ బుకింగ్స్ దీపావళి పండుగ సమయంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ లావా 5 జీ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచుల హెచ్ డి డిస్ప్లే. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంటుంది.

మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. అలాగే ఈ 5 జీ స్మార్ట్ ఫోను 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. అంతే కాకుండా ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని ర్యామ్‌ను 3జీబీ వరకు అదనంగా పొడిగించుకోవచ్చు. మైక్రో Sd కార్డ్ స్లాట్ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రానుంది.

  Last Updated: 04 Oct 2022, 06:01 PM IST